Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Blockage: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. గుండెలో అడ్డంకులు కావొచ్చు..

ప్రస్తుతం గుండె జబ్బులు వృద్ధులకు మాత్రమే వస్తాయని అనుకోవద్దు. మారిన కాలంతో పాటు మారిన జీవన శైలి వలన యువతలో కూడా అనేక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెలో అడ్డంకులు ఏర్పడటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇది పెద్దగా సూచనలు ఇవ్వకుండానే క్రమంగా తీవ్రమైన రూపాన్ని సంతరించుకుంటుంది. అటువంటి పరిస్థితిలో గుండెలో అడ్డంకులు ఏర్పడటానికి కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? దానిని నివారించడానికి ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

Heart Blockage: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. గుండెలో అడ్డంకులు కావొచ్చు..
Heart Blockage
Surya Kala
|

Updated on: Jul 03, 2025 | 9:50 AM

Share

కొవ్వు, కొలెస్ట్రాల్, ఇతర పదార్థాలు గుండె సిరల్లో అంటే కరోనరీ ధమనులలో పేరుకుపోయినప్పుడు.. దానిని గుండెలో అడ్డంకి అంటారు. ఈ పరిస్థితిని “అథెరోస్క్లెరోసిస్” అని కూడా అంటారు. ఈ నిక్షేపం క్రమంగా రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. దీని కారణంగా గుండెకు తగినంత ఆక్సిజన్, పోషకాలు లభించవు. కాలక్రమేణా అడ్డంకులు పెరిగితే గుండెపోటు లేదా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. తరచుగా ఈ సమస్య నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. దాని లక్షణాలు ప్రారంభంలో చాలా తక్కువగా లేదా అసాధారణంగా ఉండవచ్చు. దీని కారణంగా ప్రజలు ఈ సమస్యని విస్మరిస్తారు. గుండెలో అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయి. దాని లక్షణాలు ఏమిటి? దానిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.

గుండె మూసుకుపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ప్రధానమైనది చెడు జీవనశైలి. అధిక నూనె, కొవ్వు పదార్ధాలు, ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, నిరంతర ఒత్తిడి కూడా ఈ సమస్యకు ప్రధాన కారణాలు. దీనితో పాటు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణాలు. జన్యుపరమైన అంశాలు కూడా ఒక వ్యక్తిలో ఈ సమస్యను కలిగిస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా ఈ గుండె జబ్బులు ఉంటే.. వయస్సుతో పాటు, సిరల వశ్యత తగ్గుతుంది. ఇది అడ్డుపడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ కారణాలను సకాలంలో గమనించకపోతే.. ఈ సమస్య తీవ్రంగా మారవచ్చు. ప్రాణాంతకం కూడా కావచ్చు.

గుండె ఆగిపోవడం లక్షణాలు ఏమిటి? రాజీవ్ గాంధీ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అజిత్ జైన్ గుండెపోటు లక్షణాల గురించి వివరిస్తూ వ్యక్తి శారీరక స్థితి, అడ్డంకి తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. ప్రారంభంలో తేలికపాటి అలసట లేదా శ్వాస ఆడకపోవడం వంటి చిన్న ఫిర్యాదులు ఉండవచ్చు. వీటిని ప్రజలు తరచుగా విస్మరిస్తారు. గుండెలో అడ్డంకి పెరగడం ప్రారంభించినప్పుడు ఛాతీలో నొప్పి, ఒత్తిడి లేదా మండుతున్న అనుభూతి కలుగుతుంది.ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా కఠినమైన పని చేస్తున్నప్పుడు ఈ నొప్పి ఎడమ చేయి, మెడ, దవడ లేదా వీపు వరకు వ్యాపిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీనితో పాటు అలసట, భయము, చెమటలు పట్టడం, తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, క్రమరహిత హృదయ స్పందన రేటు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొంతమంది నిద్రపోతున్నప్పుడు కూడా ఛాతీలో భారంగా అనిపించవచ్చు. అలాంటి లక్షణాలు పదే పదే కనిపిస్తే.. అది గుండె మూసుకుపోయిందనడానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించి తనిఖీ చేయించుకోవడం మంచిది.

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి?

  1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
  2. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.
  3. ధూమపానం, మదయానికి పూర్తిగా దూరంగా ఉండండి.
  4. రక్తపోటు, కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోండి.
  5. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా యోగా చేయండి.
  6. ప్రతిరోజూ కనీసం 8 గంటలు నిద్రపోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..