AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Over Thinking: ప్రతి అంశానికి అతిగా ఆలోచిస్తున్నారా? జాగ్రత్త ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది..!

ఆఫీసు ఒత్తిడి, పనిభారం మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తాయి. చెడు ఆలోచనలు రావడం మొదలవుతాయి. ఏదైనా ఒక విషయం గురించి అనవసరంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. సమస్య పరిష్కారమైందా? లేదా? అనేది తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ అతిగా ఆలోచించే అలవాటు వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది మానసికంగా, శారీరకంగా మరింత కుంగదీస్తుంది.

Over Thinking: ప్రతి అంశానికి అతిగా ఆలోచిస్తున్నారా? జాగ్రత్త ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది..!
Over Thinking
Shiva Prajapati
|

Updated on: Jun 01, 2023 | 6:28 AM

Share

ఆఫీసు ఒత్తిడి, పనిభారం మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తాయి. చెడు ఆలోచనలు రావడం మొదలవుతాయి. ఏదైనా ఒక విషయం గురించి అనవసరంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. సమస్య పరిష్కారమైందా? లేదా? అనేది తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ అతిగా ఆలోచించే అలవాటు వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది మానసికంగా, శారీరకంగా మరింత కుంగదీస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులపై ప్రభావం..

ఏదైనా సమస్యతో ఇబ్బంది పడినప్పుడు, ఏదైనా అంశం గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు, కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఈ ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిని భారీగా పెంచుతుంది. ఈ కారణంగానే మధుమేహ రోగులకు ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేకంగా సలహా ఇస్తారు నిపుణులు.

నరాలపై చెడు ప్రభావం..

శరీరంలోని మొత్తం నాడీ వ్యవస్థ.. సమాచార బట్వడా వ్యవస్థలా పని చేస్తుంది. అయితే, అతిగా ఆలోచించడం, ఒత్తిడికి గురికావడం ద్వారా.. అదే సందేశం నరాలలో ప్రసారం చేయబడుతుంది. ఇది గుండె, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడితో బాధపడేవారు సులభంగా అనారోగ్యానికి లోనవుతారు. ఒక్కోసారి పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

గుండెపై ప్రభావం..

ఒత్తిడికి గురయితే.. రక్తపోటు పెరుగుతుంది. ఈ కారణంగా, ధమనిలో వాపు సంభవించవచ్చు. ఇది గుండెకు హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే, అతిగా ఆలోచించడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడిని ఇలా కంట్రోల్ చేసుకోండి..

ఒత్తిడి, అతిగా ఆలోచించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే.. ఒత్తిడి నుంచి బయటపడేందుకు రోజూ వ్యాయామం చేయడం, యోగాసనాలు వేయడం చాలా ఉత్తమం.

జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..