నిమ్మ ఆకులు నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయా ? నిమ్మాకులు వలన కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా..
సాధరణంగా నిమ్మకాయలు మనకు ఏదోరకంగా ఉపయోగపడుతునే ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకురుస్తాయన్న
lemon leaves benefits: సాధరణంగా నిమ్మకాయలు మనకు ఏదోరకంగా ఉపయోగపడుతునే ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకురుస్తాయన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే కేవలం నిమ్మకాయలే కాకుండా.. వాటి ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. వీటి వలన చాలా ప్రయోజనాలున్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
☛ నీళ్లను వేడిచేసి అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానాబెట్టాలి. ☛ మానసికంగా డిప్రెషన్‌కు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి.. ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గుతడమే కాకుండా.. ఉత్సహాంగా ఉంటారు. ☛ ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా వీటిని వాడుతుంటారు. ☛ నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానాబెట్టి తాగితే.. నిద్రలేమి సమస్య, గుండెదడ, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానాబెట్టాలి. ☛ నిమ్మఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ☛ ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. ☛ వీటిని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా పళ్ళలో ఉండే బ్యాక్టీరియాను నాశనమయ్యి.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ☛ స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని హ్యాండ్ వాష్ లా కూడా వాడోచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాస్తే.. బాక్టీరియా నశిస్తుంది. ☛ కడుపులో వికారంగా ఉన్నప్పుడు వీటిని తీసుకోవడం వలన ఆ సమస్య తగ్గుతుంది.
Also Read: Health News: శరీరంలో అధిక వేడి సమస్యతో బాధపడుతున్నారా ? ఇలా చేస్తే వేడి తగ్గిపోవడం ఖాయం..