Health News: శరీరంలో అధిక వేడి సమస్యతో బాధపడుతున్నారా ? ఇలా చేస్తే వేడి తగ్గిపోవడం ఖాయం..
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక వేడి సమస్యతో బాధపడుతుంటారు. శరీరంలో అధిక వేడి ఉన్నవాళ్ళు ఎప్పుడు నీరసంగా.. జ్వరం వచ్చినట్లుగా ఉంటారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక వేడి సమస్యతో బాధపడుతుంటారు. శరీరంలో అధిక వేడి ఉన్నవాళ్ళు ఎప్పుడు నీరసంగా.. జ్వరం వచ్చినట్లుగా ఉంటారు. అంతేకాకుండా చాలా మందికి చర్మంపై పొక్కులు, చర్మం ఉడిపోవడం, నోటిపూత లాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. శరీరంలో అధిక వేడిని తగ్గించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
☛ శరీరంలో అధిక వేడి సమస్య ఉన్నవారు ఎక్కువగా నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఉదహారణకు పుచ్చకాయ, కర్భుజా, ద్రాక్ష, బత్తాయి లాంటివి తినడం ద్వారా క్రమంగా వేడి తగ్గుతుంది. ☛ అంతేకాకుండా దానిమ్మ రసం, నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి సమస్య తగ్గుతుంది. మెంతులు పొడి చేసుకొని నీళ్ళలో కలుపుకొని తాగితే వేడి శాతం తగ్గుతుంది. అలాగే గసగసాలను పొడి చేసి నీళ్ళలో కలుపుకొని తాగిన ఫలితం ఉంటుంది. ☛ కొంతమంది తలనొప్పి, మలబద్ధకం సమస్యలతో బాధపడుతుంటారు. ఆ సమయంలో ఛాతీ, మణికట్టు భాగాలలో ఐస్ తీసుకొని రాసుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. చల్లని పాలల్లో తేనే కలుపుకొని తాగిన వేడి తగ్గుతుంది. అలాగే గంధాన్ని నుదుటిపై రాసుకున్నా వేడి తగ్గుతుంది. ☛ వీటితోపాటు అలోవేరా జ్యూస్ రోజూ తాగడం వలన అధిక వేడి సమస్య తగ్గుతుంది. ఎక్కువగా చల్లని నీటిని తాగడం వల్ల కూడా ఫలితం కన్పిస్తుంది. ☛ వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు రోజు అన్నంలో కాసిన్ని నీళ్ళు కలుపుకొని తినడం కూడా మంచిదే. ఈ టిప్స్ పాటించడం వలన క్రమంగా శరీరంలో ఉన్న అధిక వేడి సమస్య నుంచి కోలుకుంటారు.
Also Read:
Health News: రోజూ కాఫీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. ప్రయోజనాలను తెలుకుందాం..