AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా ? పడుకునే ముందు ఈ 5 రకాల డ్రింక్స్ తాగితే రిజల్ట్ పక్కా..

బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. ఇక గూగుల్ పుణ్యమా అని బరువు ఎలా తగ్గాలి అనగానే బోలెడన్నీ డైట్ మార్గాలు చూపిస్తుంది. కానీ అవన్నీ నిజమా

బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారా ? పడుకునే ముందు ఈ 5 రకాల డ్రింక్స్ తాగితే రిజల్ట్ పక్కా..
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2021 | 3:41 PM

Share

బరువు తగ్గడానికి అనేక మార్గాలున్నాయి. ఇక గూగుల్ పుణ్యమా అని బరువు ఎలా తగ్గాలి అనగానే బోలెడన్నీ డైట్ మార్గాలు చూపిస్తుంది. కానీ అవన్నీ నిజమా కాదా అనేది చాలామందిలో కలుగుతున్న సందేహమే. కానీ కొన్ని రకాల డైట్ ప్లాన్స్ మనకు తెలిసినవే. అందులో ఒకటి రాత్రి అన్నం తిన్నాక ఏదైనా తినడం.. తాగడం వంటివి చేస్తుంటాం. అయితే రాత్రి సమయంలో జీర్ణక్రియ సరైన విధంగా పనిచేయడం.. అలాగే సరైన నిద్ర ఇవి బరువు తగ్గేందుకు చాలా సహయపడతాయి. వీటి కోసం రాత్రి పడుకునే ముందు రెండు గంటల ముందే భోజనం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే అధిక కేలరీలు, స్పైసీ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమం. కానీ కొన్ని సందార్భాల్లో చాలా మంది తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. అలా కాకుండా.. సులభంగా బరువు తగ్గేందుకు.. పగటివేళలో శరీరానికి తగినంత శ్రమ, వేళకు నిద్ర మంచిది. నిద్రలో ఉన్నప్పుడు ఎముకలకు కదలిక చేయడానికి ప్రోటీన్ ఫుడ్ సహయపడుతుంది.

1. పాలలో ట్రిప్టోఫాన్ మరియు కాల్షియం కలిగి ఉంటాయి. పాలు మంచి నిద్రను కలుగజేస్తాయి. ఇందులో కేసైన్, ప్రోటీన్ ఉండడం వలన.. అందులోని ప్రోటీన్ దీర్ఘకాలంగా కండరాల బలానికి ఉపయోగపడుతుంది. పడుకునే ముందు బాదంపాలు లేదా సోయా పాలు తాగడం మంచింది.

2. Chamomile tea… నిద్ర లేమి సమస్య ఉన్నవారు ఈ చమోమిలే టీ తీసుకువడం ఉత్తమం. ఇది శరీరంలోని గ్లైసిన్ స్థాయిలను పెంచుతుంది. ఇందులోని న్యూరోట్రాన్స్మిటర్ నరాలను సడలించి మంచి నిద్రను కలుగజేస్తాయి. కడపు నొప్పి సమస్యను కూడా ఈ టీ నివారిస్తుంది. అలాగే రక్తంలోనే చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా ఈ టీ పనిచేస్తుందని అధ్యాయనాల్లో తేలింది. కాబట్టి నిద్రించే ముందు ఒక కప్పు చమోమిలే టీ తాగాలి.

3. దాల్చిన చెక్క టీ.. మన వంటింట్లో ఉండే మాసాలలో దాల్చిన చెక్క ఒకటి. దీనివలన మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. సాధారణంగా దీనికి జీవక్రియ పెంచే లక్షణాలు ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక ఖచ్చితమైన డిటాక్స్ డ్రింక్‏గా పనిచేయడమే కాకుండా.. శరీరంలోని వ్యర్థమైన కొవ్వును తగ్గిస్తుంది. దీని రుచి నచ్చకపోతే ఇందులో చిటికెడు తేనేను కలుపుకొని తాగేయ్యాలి.

4. నానపెట్టిన మెంతులు.. నానబెట్టిన మెంతులు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించాడానికి సహయపడతాయి. సాధరణంగా వీటిని ఉదయం మాత్రమే తింటుంటారు కానీ.. రాత్రి వెళలో కూడా తినవచ్చు. ఇవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి.. బరువు తగ్గడానికి సహయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇవి గొప్ప యాంటాసిడ్స్.

5. పసుపు పాలు.. పసుపు పాలు తాగడం వలన జలుబు, దగ్గు మరియు ఇతర రోగాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహయపడుతుంది. ఎందుకంటే పసుపులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు విడుదల చేస్తాయి. ఇందులో కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉన్నాయి. అలాగే సరైన నిద్ర మరియు బరువు తగ్గేందుకు తొడ్పడతాయి.

Also Read:

మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా ? దాని లక్షణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం..