AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా ? దాని లక్షణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం..

నిత్యం వేధిస్తూ.. తట్టుకోలేనంత భాధను కలిగిస్తూ.. ఎలాంటి వైద్యపరీక్షలు చేసినా.. కనిపించకుండా వేధించే తలనొప్పే మైగ్రేన్. ఉద్యోగులకు, మహిళలకు

మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా ? దాని లక్షణాలు... తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకుందాం..
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2021 | 6:48 PM

Share

నిత్యం వేధిస్తూ.. తట్టుకోలేనంత భాధను కలిగిస్తూ.. ఎలాంటి వైద్యపరీక్షలు చేసినా.. కనిపించకుండా వేధించే తలనొప్పే మైగ్రేన్. ఉద్యోగులకు, మహిళలకు ఈ సమస్య వేధిస్తుంటుంది. విచిత్రం ఏంటంటే ఈ సమస్య మగవారితో పోలీస్తే.. ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్‏కు వచ్చే కారణాలు, లక్షణాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధరణంగా ఈ సమస్య ఉన్నవారి మెదడు చుట్టూ ఉండే రక్తనాళాలు వాటి పరిమాణం ఆకస్మాత్తుగా వ్యాకోచిస్తాయి. దీంతో నరాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి.. వివిధ రకాల రసాయనాలు విడుదల అవుతాయి. వీటితో నొప్పి, వాపు రావడమే కాకుండా… భరించలేనంత తలనొప్పి వస్తుంది. దానిని మైగ్రేన్ అంటారు.

లక్షణాలు..

☛ తట్టుకోలేనంతగా తలనొప్పి వేధిస్తుంటుంది. ☛ ఒక్కోసారి తనకు ఒకవైపు లేదా రెండు వైపుల తల పగిలిపోతున్నట్లుగా నొప్పి రావచ్చు. ☛ పనులు చేస్తుంటే నొప్పి మరింత బాధిస్తుంటుంది. ☛ఒక్కోసారి కళ్ళచుట్టూ, కణతలో, తల వెనక భాగంలో తీవ్రమైన నొప్పి రావడమే కాకుండా.. ఒక సైడ్ నుంచి మరోసైడ్ మారుతుంటుంది. ☛ కొందరికి వాంతులు, వికారంగా ఉంటుంది. ☛ కొందరికి విరేచనాలు కలుగుతాయి. ☛ మరికొందరిలో ముఖం పాలిపోవడం, కాళ్ళు చేతులు చల్లబడడం జరుగుతుంటుంది. ☛ ఇక మరికొంత మంది అసలు వెలుతురును తట్టుకోలేరు. ఎక్కువ శబ్దాన్ని వినలేరు. ☛ చిరాకు, నీరసం, ఉత్సాహాంగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎక్కువగా అవలింతలు తీస్తుంటారు.

కారణాలు..

☛ ఎక్కువగా లైట్ ఫోకస్ కింద ఉండడం. ☛ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవడం. ☛ నిద్రలేమి తరచూ ఉపవాసాలుండడం. ☛ హార్మోన్ల సమస్యలు. ☛ ఆల్కహాల్ అలవాటు, పొగాకు.. సిగరేట్ తాగడం. ☛ కాఫీ లేదా కెఫిన్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం. ☛ స్త్రీలలో నెలసరి సమస్యలు ఉండడం.

మైగ్రేన్ వచ్చే ముందు లక్షణాలు..

☛ ఈ సమస్య వచ్చే ముందు కళ్ళ ముందు మెరుపులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువ వెలుతురును చూడలేరు.

జాగ్రత్తలు.. ☛ ఎక్కువగా శబ్ధాలు వినకపోవడం, వెలుతురు లేని గదిలో పడుకోవాలి. సరైన నిద్ర అవసరం. ☛ మద్యం, పొగతాగే అలవాట్లు మానుకోవాలి. ☛ రోజూ తగినంత నీరు తాగాలి. ☛ జీవనశైలిలో మార్పు చేసుకోవాలి. ☛ రోజూ వ్యాయామం చేయాలి. ☛ తలనొప్పి ఉన్నప్పుడు మాంసం, పప్పులు తినడం తగ్గించాలి. ☛ యోగా చేయాలి.

చికిత్స..

☛ రెండు రకాలు చికిత్సలు చేయవచ్చు. ☛ నొప్పి వచ్చినప్పుడు తక్షణమే తగ్గించుకునేందుకు తీసుకునేది ఒకటి. ☛ శాశ్వతంగా రాకుండా తీసుకునే చికిత్స దీర్ఘకాలిక చికిత్స. ☛ ఈ సమస్యకు డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం, మందులు వాడడం ఉత్తమం. అలాగే వయసు పెరుగుతూ ఉంటే ఈ సమస్య తగ్గితుంది.

Also Read:

Diabetes: తక్కువ బరువు ఉన్నవారికి డయబెటిస్ వస్తుందా ? నిపుణులు చెప్తున్న విషయాలెంటీ..