AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali Coronil: పతంజలి ‘కరోనిల్‌’కు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌.. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి ధృవీకరణ పత్రం

Patanjali Coronil: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. పతంజలి ఆయుర్వేదం తన కరోనిల్‌ ఔషధంను ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నట్లు ...

Patanjali Coronil: పతంజలి 'కరోనిల్‌'కు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌.. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి ధృవీకరణ పత్రం
Subhash Goud
|

Updated on: Feb 19, 2021 | 6:02 PM

Share

Patanjali Coronil: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. పతంజలి ఆయుర్వేదం తన కరోనిల్‌ ఔషధంను ఆయుష్‌ మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నట్లు హరిద్వార్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ శుక్రవారం ప్రకటించింది. యోగా గురువు రామ్‌దేవ్‌ 158 దేశాలకు చెందిన ఔషధమైన దివ్య కరోనిల్‌ టాబ్లెట్‌, దివ్య శ్వాసరి ఎగుమతి చేయడానికి అనుమతిస్తూ ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి ఔషధ ఉత్పత్తుల ధృవీకరణకు అనుమతి తీసుకున్నట్లు పేర్కొంది.

అయితే కోవిడ్-19కు పతంజలి రూపొందించిన ‘ఎవిడెన్స్ బేస్ట్ మెడిసెన్’ పరిశోధనా పత్రాన్ని రామ్‌దేవ్ బాబా శుక్రవారంనాడు ఢిల్లీలో విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మరో మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఔషధ ఉత్పత్తి, దాని ఉత్పత్తిదారు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అర్హులని నిర్ధారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన ఫార్మాట్‌లో జారీ చేసిన సర్టిఫికేట్‌ గురించి వెల్లడించిన యోగా గురువు రాందేవ్‌బాబ కరోనిల్‌ కరోనా కోసం తొలి సహాయక మందు అని పేర్కొన్నారు.

కాగా, రాందేవ్‌ బాబా గత ఏడాది జూన్‌లో కరోనిల్‌ అనే ఔషధంతో సహా మూడు ఉత్పత్తులతో కూడిన కోవిడ్‌ కిట్‌ను ప్రారంభించారు. మొదట్లో కరోనా వైరస్‌కు దీనిని ‘నివారణ’గా అభివర్ణించారు. అయితే ఆ తర్వాత ఈ ఔషధం పలు వివాదాల్లో చిక్కుకుంది. పతంజలి ఉత్పత్తి తన వాదనకు మద్దతు ఇవ్వడానికి సరైన క్లినికల్‌ ట్రయల్‌ డేటా లేకపోవడంతో దగ్గు, జ్వరం, రోగనిరోధక శక్తిని పెంచే ఔషధంగా విక్రయించడానికి అనుమతి కోరిందనే దానిపై వివాదం నెలకొంది. 2020 డిసెంబర్‌లో హరిద్వార్‌ ఆధారిత సంస్థ ఆయుష్‌ మంత్రిత్వశాఖతో కరోనిల్‌ టాబ్లెట్ల కోసం ఆయుష్‌ లైసెన్స్‌ను రోగ నిరోధక శక్తిని పెంచే కోవిడ్‌-19కు ఉపయోగించే ఔషధానికి అప్‌డేట్‌ చేయమని విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రతిపాదనను ఆయుష్‌ మంత్రిత్వ శాఖ కంపెనీకి జారీ చేసి పతంజలి ఆయుర్వేదం తన బుక్‌లెట్‌లో ప్రచురించి లేఖ ప్రకారం డాక్టర్‌ ఎస్‌.కె మౌలిక్‌, మాజీ ప్రొఫెసర్‌, ఫార్మకాలజీ విభాగం, ఎయిమ్స్‌, తువి, అశ్వగంధ వంటి ప్రధాన పదార్థాలు కోవిడ్‌-19 కొరకు నేషనల్‌ క్లినికల్‌ ప్రోటోకాల్‌లో చేర్చబడ్డాయి. అయితే దీనిని కోవిడ్‌లో సహాయక మెడిసిన్‌గా ఉపయోగించవచ్చని సూచించిందని పతంజలి పేర్కొంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన లేఖ ప్రకారం కరోనిల్ ఔషధాన్ని కరోనా నివారణ మందుగా కాకుండా సహాయక చికిత్సగా మాత్రమే ఉపయోగించవచ్చని స్పష్టం చేశారు.

కరోనిల్‌ ఇమ్యూనిటీని పెంచుతుంది: రాందేవ్‌ బాబా

ఈ సందర్భంగా శుక్రవారం రాందేవ్‌ బాబా మాట్లాడుతూ.. కరోనిల్‌ శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు ఉపయోగపడుతుందని, కోవిడ్‌ను అదుపులో ఉంచేందుకు సమర్ధవంతంగా పని చేస్తుందని అన్నారు. తమ ఔషధానికి భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. 150కుపైగా దేశాలకు సరఫరా చేసేందుకు కోవిడ్‌ -19ని అదుపు చేసేందుకు కరోనిల్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగ శాస్త్రీయ పరిశోధనలు పూర్తి చేసిన తర్వాత కరోనిల్‌ ఔషధానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు.