AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. కొన్ని సెకన్లు కంపించిన భూమి.. పరుగులు తీసిన జనాలు..

Earthquake Today: ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది.

Earthquake in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ భూకంపం.. కొన్ని సెకన్లు కంపించిన భూమి.. పరుగులు తీసిన జనాలు..
Shiva Prajapati
|

Updated on: Feb 19, 2021 | 6:21 PM

Share

Earthquake in Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రోడ్డుపైన వాహనదారులు తమ వాహనాలను ఒక్కసారిగా ఆపేసి కిందకు దిగారు. భూమి కొన్ని సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక హడలిపోయారు. కాగా, భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైంది. కాగా, పిథోర్‌గఢ్‌కు ఈశాన్యంగా 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ వెల్లడించింది. భూప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ వాటిల్లలేదని స్థానిక అధికారులు ప్రకటించారు.

ఇదిలాఉండగా, వారం రోజుల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ పట్టణాల్లో భూమి కంపించింది. ఇక రాజస్థాన్‌లోనూ భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.3గా ఉందని ఎన్‌సీఎస్ అధికారులు ప్రకటించారు.

National Centre of Seismology Tweet:

Also read:

Patanjali Coronil: పతంజలి ‘కరోనిల్‌’కు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌.. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి ధృవీకరణ పత్రం

స్టీల్‌ ప్లాంట్‌పై కొత్త రాగం అందుకున్న బీజేపీ నేతలు.. ఆ ఇష్యూను పక్క దారి పట్టించేందుకేనన్న సోము వీర్రాజు