స్టీల్ ప్లాంట్‌పై కొత్త రాగం అందుకున్న బీజేపీ నేతలు.. ఆ ఇష్యూను పక్క దారి పట్టించేందుకేనన్న సోము వీర్రాజు
ఏపీలో ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఉడుంపట్టులాగా సాగుతుంది. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కి తగ్గేదాకా తాము..
ఏపీలో ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఉడుంపట్టులాగా సాగుతుంది. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయం నుంచి కేంద్రం వెనక్కి తగ్గేదాకా తాము తగ్గబోమంటున్నారు కార్మికులు. కార్మికులకు అధికార పార్టీ వైసీపీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల కామెంట్స్ ఆసక్తిగా మారాయి.
ఢిల్లీ వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తాం అన్న ఏపీ బీజేపీ నేతలు… కొత్త రాగం అందుకున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను కప్పిబుచ్చడానికి… స్టీల్‌ప్లాంట్ ఉద్యమం అంటూ ప్రజలు దృష్టిని మరల్చుతున్నారన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. వైసీపీ, టీడీపీ కలిసి ఆడిస్తున్న స్టీల్ ప్లాంట్ డ్రామా అన్నారు.
మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కూడా అదే విమర్శ చేశారు. రాష్ట్రంలో మతమార్పిళ్లు ప్రోత్సహిస్తు ప్రభుత్వ పెద్దలు అరాచకాలకు పాల్పడుతున్నారని.. దాన్ని కవర్ చేసేందుకే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్నారు. ఇక బీజేపీ నాయకులకు కౌంటరిచ్చారు మంత్రి కొడాలి నాని. సోము వీర్రాజు మాటలకు విలువేముందని ప్రశ్నించారాయన.
Read more:
ఎవరైనా తన వెనుక రావాల్సిందేనన్న ఎంపీ.. వారిని గాడిలో పెట్టకపోతే పార్టీకే నష్టమన్న కేశినేని నాని