ఎవరైనా తన వెనుక రావాల్సిందేనన్న ఎంపీ.. వారిని గాడిలో పెట్టకపోతే పార్టీకే నష్టమన్న కేశినేని నాని

విజయవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య నడుస్తున్న కోల్డ్‌ వార్‌ పార్టీ..

ఎవరైనా తన వెనుక రావాల్సిందేనన్న ఎంపీ.. వారిని గాడిలో పెట్టకపోతే పార్టీకే నష్టమన్న కేశినేని నాని
Follow us
K Sammaiah

|

Updated on: Feb 19, 2021 | 5:23 PM

విజయవాడ టీడీపీలో విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య నడుస్తున్న కోల్డ్‌ వార్‌ పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భగ్గుమంది. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గీయులు కేశినేని వర్గాన్ని నిలువరించడంతో ఇరు వర్గాలకు చెందిన శ్రేణులు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

తనకున్న ప్రజాబలంతో విజయవాడలో టీడీపీని గెలిపిస్తానని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. బెజవాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చిన వేళ ఎంపీ కేశినేని నాని కామెంట్స్‌ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రజలు వ్యక్తిత్వంతో పాటు సమర్థత ఉన్నవాడినే నమ్ముతారని కేశినేని నాని అన్నారు. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు ఆమడదూరం ఉంచుతారని తెలిపారు.

ఓడిపోయిన సామంతులే పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు కేశినేని. ఓటమి చెందే అభ్యర్థులను మార్చితే తప్పేంటి? అని ప్రశ్నించారు. ముస్లిం కోసం చంద్రబాబును కూడా కాదని నిలబడ్డానని కేశినేని నాని వెల్లడించారు. ఎవరైనా తన వెనుక రావాల్సిందే తప్ప తాను ఒకరి వెనుక వెళ్లనని స్పష్టం చేశారు. అయితే అందరూ కలిసి వెళ్లాల్సిన సమయంలో పార్టీని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

తాను, తన కుమార్తె విజయవాడ మేయర్ పదవి కోసం కష్టపడడం లేదని, తమకు పదవులు అక్కర్లేదని, పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తున్నామని నాని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇక్కడి పరిణామాలపై చంద్రబాబు వెంటనే స్పందించి వారిని గాడిలో పెడితే పార్టీకే మంచిదని అన్నారు.

Read more:

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. ఆ అధికారం ఎస్ఈసీకి లేదన్న ధర్మాసనం