Rare Duck Spotted: ప్రపంచంలోనే అందమైన పక్షుల్లో ఒకటైన మాండరిన్ బాతు 150 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం.. బారులు తీరుతున్న జనం
అసోం లోని మగురి మోతపుంజ్ బీల్ అనే చిత్తడి ప్రాంతానికి ఓ అందమైన అరుదైన పక్షి అతిధిగా వచ్చింది. దాదాపు 150 ఏళ్ల తర్వాత కనిపించిన ఈ పక్షిని చూడడానికి స్థానికులు భారీ...
Rare Duck Spotted in Assam: అసోం లోని మగురి మోతపుంజ్ బీల్ అనే చిత్తడి ప్రాంతానికి ఓ అందమైన అరుదైన పక్షి అతిధిగా వచ్చింది. దాదాపు 150 ఏళ్ల తర్వాత కనిపించిన ఈ పక్షిని చూడడానికి స్థానికులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఈ బాతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఆ అరుదైన పక్షి గురించి తెలుసుకుందాం..
అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని మాగురి బిల్ అనే సరస్సు వన్యప్రాణులకు సహజ నివాసం. డిబ్రూ నదికి దక్షిణ ఒడ్డున అనేక రకాల పక్షులకు ఆలవాలం.. ఇక్కడ దాదాపు 304లకు పైగా వలస పక్షి జాతులు నివసిస్తుంటాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం మాండరిన్ బాతు కనిపించడం విశేషం. ఎరుపు రంగు ముక్కు, నలుపు రంగు తోక.. సప్తవర్ణాల మేళవింపుతో నెమలికి పోటీ వస్తూ కనువిందు చేస్తుందీ బాతు.
ఇక ప్రపంచంలోనే అందమైన బాతుగా ‘మాండరిన్ బాతు’కు పేరుండగా.. 1902 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ పక్షి ఇక్కడ కనిపించిందని, ఇది తననెంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసిందని స్థానిక బర్డ్ గైడ్ బినంద హతిబోరువా తెలిపాడు. ఇది ప్రపంచంలోని 10 అందమైన పక్షులలో ఒకటి. ఇది చైనీస్ సంస్కృతికి చిహ్నం. మాండరిన్ బాతు యొక్క ఫోటో చైనాలో ప్రతిచోటా చూడవచ్చు ఆడ మాండరిన్ బాతుతో పోల్చితే, మగ బాతులు మరింత ఆకట్టుకునే రంగుల్లో ఉంటాయి. రష్యా, కొరియా, జపాన్‌తో పాటు చైనాలోని ఈశాన్య భాగాల్లో ఈ బాతులు ఎక్కువగా కనిపిస్తాయి.
TINSUKIA: A mandarin duck was spotted in Assam earlier this week for the first time in 118 years by a team of the Wildlife Trust of India (WTI). The rare colourful duck was spotted in the wetland Maguri Motapung Beel, near Baghjan in Tinsukia.@ParveenKaswan pic.twitter.com/Wopd46RTpO
— Niraj S (@nirajntsh) February 17, 2021
Also Read: