AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో ఈదుకుంటూ వెళ్లి అంతిమక్రియలు.. శ్మశానవాటిక లేక గ్రామస్థులకు తప్పని తిప్పలు

ఓ వ్యక్తి చనిపోవడంతో అతని దహనసంస్కారాలకు స్థలం లేక నదిని దాటుతూ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హృదయ విదారకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

నదిలో ఈదుకుంటూ వెళ్లి అంతిమక్రియలు.. శ్మశానవాటిక లేక గ్రామస్థులకు తప్పని తిప్పలు
Balaraju Goud
|

Updated on: Feb 19, 2021 | 4:59 PM

Share

Carrying the dead body River : మనిషి బతికినన్ని రోజులూ ఎక్కడైనా, ఏదోలా బతికేయొచ్చు. కానీ అదే మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలకైనా కచ్చితంగా కొంత ప్రదేశం కావాలి. అలాంటిది ఊరికి ఉత్తరానే ఉండాలి. కానీ.. ఇప్పుడు అవే శ్మశానాలూ కబ్జా అవుతున్నాయి. ఫలితంగా అంత్యక్రియలకూ ఆస్కారం లేకుండా పోయింది. శ్మశానవాటికకు వెళ్లడానికి సరైన రహదారి లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి చనిపోవడంతో అతని దహనసంస్కారాలకు స్థలం లేక నదిని దాటుతూ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హృదయ విదారకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తమిళనాడులోని వేలూరు జిల్లా అత్తికుప్పంలో ఓ వ్యక్తి ఇటీవల మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు అతని అంతిమక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో శ్మశానానికి వెళ్లే దారి కబ్జా చెయ్యడంతో ఊరికి ఆనుకుని ఉన్న నది దాటుకుంటూ వెళ్లి అవతలి ఒడ్డున దహనసంస్కారాలు నిర్వహించారు. శ్మశానానికి వెళ్లే దారి లేక నదిలోనే మునుగుతూ శవాన్ని మోసుకెళ్లారు గ్రామస్థులు. ఇలా ప్రాణాలకు తెగించి అంత్యక్రియలను పూర్తి చేశారు.

అయితే, అత్తి కుప్పం గ్రామంలో ఎవరైనా చనిపోతే వారిని ప్రాణాలకు తెగించి శ్మశానానికి తీసుకెళ్లాల్సిందే అంటున్నారు గ్రామస్థులు. శ్మశానికి దారి లేక నది మధ్యలోనే దిగి పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉన్న ఏ మాత్రం లెక్కచేయకుండా శవాన్ని తమ భుజం ఫై వేసుకొని వెళ్తున్నారు. శ్మశానానికి వెళ్లే దారిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడం తో వేరే దారి లేక ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. దీనిపై గ్రామస్థులు కొన్ని రోజులుగా పోరాటాలు చేసిన తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కబ్జాకు గురైన శ్మశానావాటికకు విముక్తి కలిగించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి… గుత్తికోయలపై అధికారుల ఆటివిక దాడి.. గిరిజనుల గుడిసెలు పీకి.. నిప్పంటించిన అటవీ అధికారులు

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్