Coconut Oil: రోజూ స్పూన్ కొబ్బరి నూనె తాగితే ఇన్ని లాభాలా? జ్ఞాపకశక్తి రెట్టింపవుతుందట..
కొబ్బరి నూనె వాడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చర్మ సంరక్షణ నుంచి జుట్టు పోషణ వరకు బలేగా పని చేస్తుంది. అయితే కొబ్బరి నూనె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చాలా మందికి తెలియదు. అవును.. ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు..
కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు. ఎందుకంటే ఈ చెట్టు నుండి లభించే వస్తువులన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ చెట్టు నుంచి వచ్చే కాయ, దాని నుంచి వచ్చే నూనె, కాయలోని నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. కొబ్బరి నూనెను మనం చాలా రకాలుగా ఉపయోగిస్తుంటాం. ఈ నూనెలో అధిక పోషకాలు ఉంటాయి. జుట్టు చక్కగా పెరగడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అందుకే కొబ్బరి నూనె పోషకాల సంపద అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ కూడా అధికంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతుంటారు.
అయితే మీకు తెలుసా..? కొబ్బరి నూనెను టానిక్‌గా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకోవాలట. ఇలా చేయడం వల్ల శరీరానికి ఐదు శక్తివంతమైన ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
- కొబ్బరి నూనె శరీరానికి శక్తిని ఇస్తుంది. సాధారణంగా చలికాలంలో శరీరం డల్ గా ఉంటుంది. కాబట్టి రోజూ ఒక చెంచా కొబ్బరి నూనె తాగడం వల్ల రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. ఉదయాన్నే కొబ్బరినూనె తాగడం వల్ల శరీరం బలహీనపడదు.
- ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తాగడం వల్ల శరీరంలోని కణాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరినూనె మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
- కొబ్బరి నూనె జీవక్రియను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఇది గుండెకు కూడా మంచిది.
- కొబ్బరి నూనెలో బరువు తగ్గడానికి సహాయపడే పదార్థాలు ఉన్నాయి. ఇందులో యాంటీవైరల్ గుణాలతో పాటు పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. అలాగే ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
- కొబ్బరినూనె తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. అందాన్ని పెంచుతుంది. ఇది ముఖంపై మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది.
నోట్: ఇక్కడ ఇచ్చిన విషయాలు సమాచారం కోసం మాత్రమే. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, నిపుణులను సంప్రదించవచ్చు.