Egg Benefits : గుడ్డును వెరీ గుడ్ అనేది ఇందుకునా? గుడ్డు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వావ్ అంటారు
గుడ్డును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అయితే ఉడికించిన గుడ్డు తినడం వల్ల మేలైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఉడికించిన గుడ్లు రుచికరంగా ఉండడంతో పాటు సూపర్ ఫుడ్స్‌లో ఒకటిగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం.

మనం చిన్నప్పటి నుంచి వినే మాట గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రోజూ ఓ గుడ్డు తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుడ్డును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అయితే ఉడికించిన గుడ్డు తినడం వల్ల మేలైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఉడికించిన గుడ్లు రుచికరంగా ఉండడంతో పాటు సూపర్ ఫుడ్స్‌లో ఒకటిగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. కండరాల కణజాలాన్ని నిర్మించడంతో పాటు మరమ్మతు చేయడానికి సాయం చేస్తుంది. కండరాలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా వీటిలో అధికంగా ఉంటాయి. ఉడికించిన గుడ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.
ప్రోటీన్లతో మరింత మేలు
గుడ్లు అధిక నాణ్యత ప్రోటీన్ ఉండే ఉత్తమ వనరులలో ఒకటిగా పరిగణిస్తారు. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది సగటు వయోజన వ్యక్తికి రోజువారీ సిఫార్సు చేసిన మోతాదులో 12 శాతానికి సమానం. ఇంకా బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు తగిన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. గుడ్డు కండరాల కణజాలాన్ని నిర్మించడంతో పాటు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్ల కోసం సాయపడుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.
విటమిన్లు, మినరల్స్‌కు మూలం
ఉడికించిన గుడ్లు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందిస్తుంది. ఉడికించిన గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. విటమిన్ బీ12 ఆరోగ్యకరమైన నాడీ కణాలను నిర్వహించడానికి అవసరం. అలాగే విటమిన్ డి ఎముకలు, దంతాలను బలంగా చేస్తుంది. వివిధ నివేదికల ప్రకారం, సహజంగా విటమిన్ డి కలిగి ఉన్న అతి తక్కువ ఆహారాలలో గుడ్డు సొన ఒకటి. ఉడికించిన గుడ్లలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
బరువు తగ్గే వారికి సూపర్ ఫుడ్
ఉడికించిన గుడ్లల్లో ఉండే అధిక ప్రోటీన్, తక్కువ క్యాలరీల కౌంట్ కారణంగా ఉడికించిన గుడ్లు మీ పొట్ట నిండుగా ఉంచుతాయి. అలాగే ఎక్కువ సేపు ఏం తినకుండా ఉన్నా నీరసం రాకుండా చేస్తాయి. ఉడికించిన గుడ్లు జంక్ ఫుడ్ కోరికలను ఎదుర్కోవడంలో సాయం చేస్తాయి. ఉడికించిన గుడ్లల్లో ఉండే ప్రోటీన్ బరువు తగ్గడంలో సాయం చేస్తాయి. అలాగే ఫిట్‌గా ఉండటానికి కూడా సహాయపడతాయి.
కంటి ఆరోగ్యం మరింత మెరుగు
ఉడికించిన గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, లుటిన్, జియాక్సంతిన్, సెలీనియం వంటి కంటి ఆరోగ్యానికి మేలు చేసే అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన దృష్టిని నిర్వహించడానికి విటమిన్ ఎ అవసరం. అలాగే రెటీనాకు సహాయపడే ప్రోటీన్ రోడాప్సిన్‌లో భాగం. లుటీన్, జియాక్సంతిన్ కెరోటినాయిడ్లు, ఇవి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అలాగే కళ్ళు దెబ్బతినకుండా కాపాడతాయి. ప్రత్యేకించి, లుటీన్, జియాక్సంతిన్ కంటి యొక్క మాక్యులాలో కేంద్రీకృతమై ఉంటాయి. ఇది దృశ్య తీక్షణతకు బాధ్యత వహించే రెటీనాకు కేంద్ర భాగంగా ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల వృద్ధులలో దృష్టి నష్టానికి ప్రధాన కారణమైన వయస్సు-సంబంధిత ఏఎండీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ సమాచారం కోసం క్లిక్ చేయండి.







