Pani Poori Benefits : పానీపూరీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. పానీపూరి తింటే బరువు తగ్గుతారని తెలుసా?
గప్‌చుప్, గోల్ గప్పా వంటి పానీపూరీకి ఉన్న ఫేమస్ పేర్లు. అయితే పానీపూరీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఓ వార్త ప్రస్తుతం హల్‌చల్ చేస్తుంది. పానీపూరీ ఎక్కువగా తినేవారు ఊబకాయ సమస్యల నుంచి తొందరగా బయటపడతారని వివిధ పరిశోధనల్లో తేలింది.

భారతదేశంలో ఎక్కువగా ఆదరణ పొందింన స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. చాలా మంది పానీపూరీను ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళల్లో పానీపూరీ లవర్స్ ఎక్కువగా ఉంటారు. ఏరియాను బట్టి పానీపూరి వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్, గోల్ గప్పా వంటి పానీపూరీకి ఉన్న ఫేమస్ పేర్లు. అయితే పానీపూరీ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఓ వార్త ప్రస్తుతం హల్‌చల్ చేస్తుంది. పానీపూరీ ఎక్కువగా తినేవారు ఊబకాయ సమస్యల నుంచి తొందరగా బయటపడతారని వివిధ పరిశోధనల్లో తేలింది. అలాగే శరీరీంలోని వివిధ సమస్యలకు ఈజీగా పరిష్కారం దొరుకుతుందని వెల్లడైంది.
పానీపూరీలో శరీరానికి ప్రయోజనం కలిగించే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో ఉంటుంది. పానీపూరి అసిడిటీ పరిస్థితిల్లో సాయం చేస్తుంది. జల్ జీరా నీటిలో ఆమ్లత్వంపై పని చేసే అనేక ఇతర అంశాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మూలకాలలో పుదీనా, పచ్చి మామిడి, నల్ల ఉప్పు, నల్ల మిరియాలు వంటివి ఉంటాయి. జీలకర్ర, సాధారణ ఉప్పు, నల్ల ఉప్పు, అల్లం, చింతపండు అసిడిటీ నుంచి బయటపడడానికి సాయం చేస్తాయి. అలాగే జీలకర్ర గింజలు యాంటీఆక్సిడెంట్లుగా పని చేయడంతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. పానీపూరీ వాటర్‌లో వాడే బ్లాక్ సాల్ట్ ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇందులో టేబుల్ సాల్ట్ కంటే తక్కువ సోడియం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మం, జుట్టు నాణ్యతను పెంచుతుంది. రాక్ సాల్ట్ కండరాల తిమ్మిరి, గొంతు నొప్పికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పోషకాలు ఫుల్
పానీపూరీలోని పోషక పదార్థాలు మెండుగా ఉంటాయని నిపుణులు భావన. మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్లు ఏ, బీ6, బీ12, సీ,డీ వంటి పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పానీపూరి గురించి బరువు తగ్గించే ప్రయోజనాలపై మెండుగా ఉన్నాయి. పానీపూరిలో ఉపయోగించే నీరు జీలకర్ర, పుదీనా, చింతపండు వంటివి వాడతారు. అలాగే పుదీనా నీరు, జీలకర్ర బరువు తగ్గడానికి మంచివి. బరువు తగ్గడానికి మాత్రమే కాదు. పుదీనా నీరు జీర్ణక్రియకు కూడా మంచిది. ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పుదీనాలో ఫైబర్, విటమిన్ ఎ, ఐరన్, మాంగనీస్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.



పానీపూరితో కలిగే ఆరోగ్య ప్రయోజనలు ఇవే
- పానీపూరి తింటే నోటిలోని అల్సర్లు తగ్గడంలో సాయం చేస్తుంది. ముఖ్యంగా పానీపూరీ వాటర్ కారణంగా అవి సాధారణంగా హీల్ అయ్యి త్వరగా తగ్గే అవకాశం ఉంది.
- జల్ జీరాలో బ్లాక్ స్లాట్ లేదా బ్లాక్ పెప్పర్ వంటి ఇతర పదార్థాలు వాడతారు. ఇవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి, అలాగే ఆమ్లతను నిర్వహించడంతో సాయం చేస్తాయి.
- పానీపూరీ తినడం వల్ల తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిల గురించి చింతించకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు హ్యాపీగా వీటిని తినవచ్చు. అయితే మీరు వాటిని పరిమిత పరిమాణంలో తినాలని గుర్తుంచుకోవడం ఉత్తమం.
పానీపూరీ అధికంగా తినడం వల్ల వచ్చే సమస్యలు ఇవే
- పానీపూరీలు ఎక్కువగా తింటే ట్రాన్స్‌ఫ్యాట్ సమస్య వేధించే అవకాశం ఉంది. ఎందుకంటే పూరీలు నూనెలో బాగా వేయిస్తారు. ఆ నూనె నాణ్యమైనది కావపోతే ఆరోగ్యానికి ప్రమాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్‌సమస్య వేధిస్తుంది.
- సాధారణంగా పానీపూరీలు ఓపెన్ ఏరియాల్లో కనబడేలా పెడతారు. ఇలాంటి సమయాల్లో వాటిపై బ్యాక్టిరియా పేరుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే వాటిలో ఉపయోగించే బంగాళదుంపలు వంటి పదార్థాల వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్యాలకు దారితీస్తాయి. అవి డీహైడ్రేషన్, కామెర్లు, కడుపు నొప్పి, పేగు వాపు, ఇతర జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి.
- పానీపూరీల్లో వాడే నీరు వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పానీపూరీ వాటర్ వల్ల డయేరియా వంటి అనారోగ్యాలు వేధించే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ సమాచారం కోసం క్లిక్ చేయండి.




