AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father’s Day 2022: నాన్న ఓ నమ్మకం.. కష్టాన్ని ఇష్టంగా పడుతూ.. పిల్లలకు భవిష్యత్ ఇచ్చే తండ్రికి ఫాదర్స్ డే విషెశ్ చెప్పేయండి ఇలా..

ఫాదర్స్ డేని ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం జరుపుకుంటారు. ఈసారి ఫాదర్స్ డే జూన్ 19న వచ్చింది. ఈ సందర్భంగా, మీరు మీ తండ్రికి దూరంగాఉంటే.. మీతండ్రిపై ప్రేమని తెలుపుతూ.. శుభాకాంక్షలు చెప్పండి.

Father's Day 2022: నాన్న ఓ నమ్మకం.. కష్టాన్ని ఇష్టంగా పడుతూ.. పిల్లలకు భవిష్యత్ ఇచ్చే తండ్రికి ఫాదర్స్ డే విషెశ్ చెప్పేయండి ఇలా..
Fathers Day 2022
Surya Kala
|

Updated on: Jun 18, 2022 | 12:40 PM

Share

Father’s Day 2022: భూమిపై తల్లితండ్రులకు దేవుడి కంటే ఉన్నతమైన స్థానం కల్పించారు. తల్లి తన ప్రేమను బిడ్డపై కురిపిస్తే.. తన పిల్లలకు కష్టం దరి చేరకుండా కావాలా కాసే తండ్రి పిల్లలకు పైకప్పు లాంటివాడు. పిల్లల జీవితం సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు తమ జీవితాన్నే త్యాగం చేస్తారు. పిల్లలు ఎంత చేసినా ఎన్ని చేసినా తల్లిదండ్రుల ఋణం ఎన్నడూ తీర్చుకోలేనిది.  అయితే వారికి పిల్లలు ప్రేమ, ఆనందాన్ని ఇవ్వగలరు. తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమ అంకితభావానికి గౌరవం, కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం, పితృదినోత్సవం వంటి రోజులు జరుపుకుంటారు. ఈ ఏడాది పితృదినోత్సవం జూన్ 19న వచ్చింది. . ఈ సందర్భంగా, మీరు మీ తండ్రికి దూరంగాఉంటే.. మీతండ్రిపై ప్రేమని తెలుపుతూ.. శుభాకాంక్షలు చెప్పండి. మీ కొన్ని కొన్ని కొటేషన్స్..

*మండే ఎండలో హాయిగా నీడని ఇస్తాడు.. జాతరలో భుజం మీద మోస్తూ.. తాను కష్టపడుతూ.. జీవితంలో ప్రతి ఆనందాన్ని పొందుతాడు.. అంతేకాని.. కష్టం అంటూ ఎన్నటికీ వెనుకడుగు వేయడు తండ్రి. హ్యాపీ ఫాదర్స్ డే 2022

*ఓర్పు భూమి లాంటిది.. ఎత్తు ఆకాశం లాంటిది..  జీవితంపై కరుణతో దేవుడు తల్లిదండ్రులను ఇచ్చాడు. పిల్లల ప్రతి బాధను తనపై తాను భరిస్తాడు నాన్న. ఆ దేవుని సజీవ ప్రతిమను మనం తండ్రి అని పిలుస్తాము. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

ఇవి కూడా చదవండి

*ఓడిపోయిన ప్రతిసారీ నువ్వు నవ్వుతూ.. జీవితం ఓ చదరంగం.. ఆడి గెలవాలని అంటూ వెన్నె తడుతూ ప్రోత్సహించిన నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే..

*నేను దేవుడిని ఒకటే అభ్యర్ధిస్తున్నా.. మా నాన్నగారి జీవితాంతం సంతోషంగా ఉండేలా ఆ దేవుడు చూడాలనేదే నా కోరిక. హ్యాపీ ఫాదర్స్ డే 2022

*నువ్వే ఒక స్తంభం , నువ్వే ఒక నమ్మకం, నువ్వే నా ఉనికి.. పితృ దినోత్సవ శుభాకాంక్షలు

*పాట తెలియక పోయినా , నా కోసం పాడేవాడు.. నోరు తెరచి అడగక ముందే బాల్యం నుంచి నాకు స్వీట్లు,  బొమ్మలు,  ఐస్ క్రీంనుంచి ప్రతిదీ నాకు అందించిన నాన్న.. నాకు జీవితంలో సరైన మార్గం చూపడానికి కష్టపడ్డారు. ప్రస్తుత ప్రపంచంలో తండ్రిని మాత్రమే పిల్లలకు నిజమైన తోడుగా పిలుస్తారు. హ్యాపీ ఫాదర్స్ డే 2022

*ఇది కూడా సమాజ నియమం , నాన్న ఎప్పుడూ సీరియస్‌గా ఉండాలి, మనసులో భావాలు దాచుకోవాలి, కళ్లలోంచి కన్నీరు కారకూడదు.. ప్రేమగా మాట్లాడకూడదు, మార్గనిర్దేశం చేసే మాటలు మాత్రమే చెప్పాలి,  తల్లి ప్రేమ పిల్లలకు కనిపించినా.. తండ్రి ప్రేమ భిన్నమైంది. నాన్న ఫాదర్స్ డే శుభాకాంక్షలు

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..