High Cholesterol Problems : అధిక కొలెస్ట్రాల్‌తో జుట్టు సంబంధిత సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

అధిక ఊబకాయం కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ అధిక ఊబకాయం లేదా కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంటున్నారు.

High Cholesterol Problems : అధిక కొలెస్ట్రాల్‌తో జుట్టు సంబంధిత సమస్యలు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!
Hair
Follow us
Srinu

|

Updated on: Apr 06, 2023 | 5:00 PM

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరూ అధిక కొలెస్ట్రాల్ సమస్యల అందరినీ వేధిస్తుంది. ముఖ్యంగా వయస్సుతో సంబంధం లేకుండా ఊబకాయం అందరికీ వస్తుంది. అయితే అధిక ఊబకాయం కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ అధిక ఊబకాయం లేదా కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల జుట్టు సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ అంటే పసుపు-తెలుపు మైనపు లాంటి కొవ్వు పదార్థం. ఇది మన శరీరంలోని ప్రతి కణంలో ఉంటుంది. అయితే మానవ శరీరంలో కణాలు, అవయవాలు సరిగ్గా పని చేయడం చాలా అవసరం. అలాగే ఇవి హార్మోన్, విటమిన్, జీర్ణ ద్రవాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఆందోళనకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. మీ జుట్టులో మార్పు మీ శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతన్నారు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అనేది అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా వస్తుందని నిపుణుల వాదన. ఇటీవల పరిశోధకులు ఎలుకలపై పరిశోధన చేస్తున్న సమయంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు అకాల తెల్లబడటానికి, జుట్టు రాలడానికి దారితీస్తాయని కనుగొన్నారు. ఈ అధ్యయనం నేచర్ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురించారు. పరిశోధనల కోసం ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించి, ఓ గ్రూపులోని ఎలుకలకు సాధారణ ఆహారం పెట్టి, మరో గ్రూపులోని ఎలుకలను అధిక కొలెస్ట్రాల్ ఆహారం పెట్టి ఈ విషయాన్ని కనుగొన్నారు. 

ఈ రెండు సమస్యలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తిన్న ఎలుకల్లో జుట్టు రాలిపోవడాన్ని పరిశోధకులు పరిశీలించారు. అలాగే కొన్ని ఎలుకల్లో జుట్టు కూడా తెల్లబడింది. దాదాపు 75 శాతం ఎలుకలు తీవ్రమైన జుట్టు నష్టంతో బాధపడ్డాయి. దీంతో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు జుట్టు కోల్పోయే లేదా జుట్టు తెల్లబడటం అనుభవించే పురుషుల్లో ఇలాంటి ప్రక్రియ సంభవించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ బయోసింథసిస్ నిరోధం ఫైబ్రోసిస్‌ను ప్రోత్సహించడం ద్వారా జుట్టు కుదుళ్లకు శాశ్వత నష్టం కలిగిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా జుట్టు పెరుగుదలలో సెల్యులార్ కొలెస్ట్రాల్ పాత్ర, హెయిర్ ఫోలికల్స్ ఏర్పడడంతో పాటు చర్మం ఆరోగ్యంపై ఒత్తిడి తెచ్చిందని తేలింది. ఇది కణజాల క్షీణతకు కారణమైంది. కొలెస్ట్రాల్ ప్రేరిత మార్పులు హెయిర్ ఫాలికల్స్‌లోని మూలకణాలను శాశ్వతంగా నాశనం చేసే అవశాశం ఉంది. అలాగే ఇది మచ్చలు లేదా ఫైబ్రోసిస్‌కు కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ హెయిర్ లాస్ డిజార్డర్‌కు కూడా కారణం అవుతుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) ప్రారంభ దశలో ఉన్న రోగులు వారి కాళ్లల్లో  జుట్టు రాలడాన్ని కూడా ఎదుర్కొంటారు. ధమనులలో అధిక కొలెస్ట్రాల్ చేరడం వల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. దీంతో కాళ్లకు తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో జట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!