Ghee: మీకు నెయ్యి టీ గురించి తెలుసా.? తయారీ ఎలా, ఉపయోగాలు ఏంటంటే..

అసలు నెయ్యి ఏంటి.? దీన్ని కూడా తాగుతారా.? ఆలోచిస్తున్నారా.? అయితే నెయ్యి టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఇకపై మీరు కూడా ప్రతీరోజూ నెయ్యి టీనే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇంతకీ నెయ్యి టీని ఎలా తయారు చేస్తారు.? కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ghee: మీకు నెయ్యి టీ గురించి తెలుసా.? తయారీ ఎలా, ఉపయోగాలు ఏంటంటే..
Ghee tea
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2024 | 4:25 PM

మనలో చాలా మందికి టీ కచ్చితంగా అలవాటు ఉండే ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే టీ తాగాల్సిందే. కాస్త తలనొప్పిగా అనిపించినా వెంటనే ఒక టీ తాగాల్సిందే. ఇద్దరు ఫ్రెండ్స్‌ సరదాగా కలిసినా టీ తాగుతారు. అయితే పాలతో చేసే టీ గురించే మనకు తెలిసి ఉంటుంది. లేదంటే అల్లం టీ, ఇలాచీ టీ ఇలా రకరకాల టీల గురించి తెలిసి ఉంటుంది. అయితే మీరుప్పుడైనా నెయ్యి టీ గురించి విన్నారా.?

అసలు నెయ్యి ఏంటి.? దీన్ని కూడా తాగుతారా.? ఆలోచిస్తున్నారా.? అయితే నెయ్యి టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఇకపై మీరు కూడా ప్రతీరోజూ నెయ్యి టీనే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇంతకీ నెయ్యి టీని ఎలా తయారు చేస్తారు.? కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెయ్యి టీ అనేది ఇప్పుడే అందుబాటులోకి రాలేదని, ఎన్నో ఏళ్లుగా ఈ ఆయుర్వేద విధానాన్ని ఫాలో అవుతున్నారని డైటీషియన్లు చెబుతున్నారు. నెయ్యి టీని తయారు చేయడానికి పాలు, టీపౌడర్‌, కుంకుమపువ్వు, యాలకులు, చక్కెర, నెయ్యి కావాలి. ముందుగా సాధారణంగా మనం చేసుకునే టీ లాగే టీ గిన్నెలో పాలు పాయాలి. ఆ తర్వాత వెంటనే కుంకుమపువ్వు, యాలకులు, పంచదార వేసుకోవాలి. పాలు వేడిగా కాగానే టీపొడి వేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత దించేసే ముందు నెయ్యి వేసుకోవాలి. అంతే నెయ్యి టీ రడీ అయినట్లే.

ఈ టీ తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి నెయ్యి టీ బాగా ఉపయోగపడుతుంది. జీర్ణసంబంధిత సమస్యలున్న వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బలబద్ధకం సమస్య ఉన్న వారు ఉదయాన్నే ఈ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక స్త్రీలకు పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలకు ఈ టీతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..