- Telugu News Photo Gallery You can get rid of viral fever with these tips, check here is details in Telugu
Get Rid of Viral Fever: ఈ టిప్స్‌తో వైరల్ ఫీవర్ల నుంచి బయట పడొచ్చు..
సాధారణంగా వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు ఎక్కువగా సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తూ ఉంటాయి. ఈ సమయంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండటం వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటివి వస్తాయి. అయితే కొన్ని సార్లు జ్వరం అనేది అస్సలు తగ్గదు. ఒక్కోసారి తగ్గుతూ.. మళ్లీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. దీంతో చాలా మంది తట్టుకోలేక మరణించిన వారు..
Updated on: Sep 12, 2024 | 4:24 PM

సాధారణంగా వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు ఎక్కువగా సీజనల్ వ్యాధులు ఎటాక్ చేస్తూ ఉంటాయి. ఈ సమయంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండటం వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటివి వస్తాయి. అయితే కొన్ని సార్లు జ్వరం అనేది అస్సలు తగ్గదు.

ఒక్కోసారి తగ్గుతూ.. మళ్లీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. దీంతో చాలా మంది తట్టుకోలేక మరణించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వైరల్ ఫీవర్స్ నుంచి బయట పడేందుకు ఇప్పుడు చెప్పే చిట్కాలు చక్కగా హెల్ప్ చేస్తాయి.

వైరల్ ఫీవర్ల నుంచి బయట పడాలంటే.. ముందు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. రోజుకు కనీసం 10 నుంచి 8 గ్లాసుల నీటిని తాగుతూ ఉండాలి. పండ్లు, పండ్ల రసాలు, కూరగాయలు, ఆకు కూరల సూప్స్ తాగుతూ ఉండాలి. వీటి వల్ల శరీరానికి శక్తి రావడంతో పాటు ఇమ్యూనిటీ బలపడుతుంది.

అదే విధంగా ఫీవర్ వస్తే చాలా మంది స్నానం చేయరు. కానీ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చేతులు, కాళ్లు కడుగుతూ ఉండాలి. శానిటైజర్ కూడా వాడుతూ ఉండాలి. మీ డైట్‌లో తేనె, అల్లం, తులసి, నిమ్మ రసం వంటివి ఉండేలా చూసుకోండి.

వైరల్ ఫీవర్ నుంచి బయట పడాలంటే మందులు ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి ఉండాలి. కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. ఇలా చేయడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది. వైద్యుని సలహాలు కూడా పాటిస్తూ ఉండాలి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




