AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోధుమపిండితో ఇలా చేశారంటే.. మీ ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదట!

మీరు కూడా ఎలుకల బెడదతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే, దీపావళికి శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ చిట్కాలను పాటించండి..ఒక్క ఎలుక కూడా మీ ఇంట్లో ఉండకుండా పారిపోతాయి. అలాంటి కొన్ని సాధారణ ఉపాయాలను ఇక్కడ చూద్దాం.. ఇలా చేస్తే ఎలుకలు వాటంతట అవే మీ ఇంటి నుండి దూరంగా పారిపోతాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

గోధుమపిండితో ఇలా చేశారంటే.. మీ ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదట!
Rat Control Home Remedies
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2025 | 11:26 AM

Share

ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న జరుపుకుంటారు. సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలంతా ఎక్కడ చూసినా క్లీనింగ్‌ పనుల్లో బిజీగా ఉంటున్నారు. అయితే, ఇల్లు, దుకాణాలు శుభ్రపరిచే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలుకల బెడదను నివారించవచ్చు. ఈ ప్రభావవంతమైన ఉపాయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

మీ ఇంట్లో ఎలుకలు ఉండి, వాటిని చంపకుండానే వదిలించుకోవాలనుకుంటే..ఒక అద్బుతమైన నివారణ ఉంది. దాని కోసం మీరు మీరు ఒక గిన్నెలో గోధుమ పిండి, కొంచెం చక్కెర, కొంచెం నెయ్యి, కొంచెం డిటర్జెంట్ పౌడర్, ఫినైల్ మాత్రలు అవసరం .

రెసిపీని ఎలా తయారు చేయాలి?

ఇవి కూడా చదవండి

ముందుగా, ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పిండిని తీసుకోండి. కొద్దిగా నెయ్యి, చక్కెర వేయాలి. కొద్దిగా నీరు వేసి పిండిని పిసికి కలుపుకోండి. పిండి చాలా గట్టిగా ఉండకుండా జాగ్రత్తగా తడుపుకోవాలి. మెత్తగా ఉంచండి. ఇప్పుడు, ఈ పిండిని చిన్న బంతులుగా చేయండి. మధ్యలో కొద్దిగా తెరిచి కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ కలపండి. అలాగే, పిండిచేసిన ఫినైల్ మాత్రలతో నింపండి. ఇలా తయారు చేసిన పిండి బాల్స్‌ని ఇంటి మూలల్లో ఎలుకలు కనిపించే ప్రదేశాలలో ఉంచండి. ఉదాహరణకు వంటగది, సిలిండర్ దగ్గర, అల్మారా కింద లేదా రిఫ్రిజిరేటర్ చుట్టూ అక్కడక్కడ పెట్టుకోవాలి.

ఈ పరిహారం ఎలా పనిచేస్తుంది?

నెయ్యి, చక్కెర వాసన వల్ల ఎలుకలు ఈ పిండి ముద్ద వైపు ఆకర్షితులవుతాయి. కానీ, అవి వాసన చూసిన వెంటనే లేదా కొద్దిగా తినడానికి ప్రయత్నించిన వెంటనే దాని బలమైన వాసన వాటిని ఇబ్బంది పెడుతుంది. ఇది అవి తిరిగి రాకుండా నిరోధిస్తుంది. దీంతో దెబ్బకు ఎలుకలు ఇంటి నుండి పారిపోతాయి. ఈ పరిహారం తీసుకోవడం ద్వారా, మీరు ఎలుకలను చంపకుండానే మీ ఇంటి నుండి తరిమికొట్టవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..