AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి ముందే లక్ష్మీ కాటాక్షం..! ఇల్లు క్లీన్‌ చేస్తుండగా దొరికిన నిధి..ఎంతంటే..

పండగ నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేస్తున్న ఒక కుటుంబానికి వారు పెట్టి మర్చిపోయిన పాత నిధి ఒకటి దొరికింది. ఇంట్లోని ఒక పాత పెట్టెలో దాచిపెట్టి డబ్బు ఆశ్చర్యకరంగా బయటపడింది. ఆ మొత్తం డబ్బు విలువ అక్షరాల రూ.2,00,000లు(రెండు లక్షలు) ఉన్నాయి. ఊహించని ఆ నిధి చూసి వారంతా షాక్‌ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

దీపావళికి ముందే లక్ష్మీ కాటాక్షం..! ఇల్లు క్లీన్‌ చేస్తుండగా దొరికిన నిధి..ఎంతంటే..
Family Finds Rs 2 Lakh In Old Rs 2000 Notes
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2025 | 10:09 AM

Share

దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇంటి మొత్తాన్ని పూర్తిగా శుభ్రం చేసుకుంటారు. పాత వస్తువులను పారవేసి, కొత్త వాటిని తెస్తారు. ఇలాగే, పండగ నేపథ్యంలో ఇంటిని శుభ్రం చేస్తున్న ఒక కుటుంబానికి వారు పెట్టి మర్చిపోయిన పాత నిధి ఒకటి దొరికింది. ఇంట్లోని ఒక పాత పెట్టెలో దాచిపెట్టి డబ్బు ఆశ్చర్యకరంగా బయటపడింది. ఆ మొత్తం డబ్బు విలువ అక్షరాల రూ.2,00,000లు(రెండు లక్షలు) ఉన్నాయి. ఊహించని ఆ నిధి చూసి వారంతా షాక్‌ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

దీపావళికి ముందు దాదాపు అందరూ తమ ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు క్లీన్‌ చేస్తుంటారు. కొత్తగా పెయింటింగ్‌ కూడా చేస్తుంటారు. అలాగే, ఒక కుటుంబం వారి ఇంటిని శుభ్రం చేసే పని వారికి ఊహించని విధంగా జాక్‌పాట్‌గా మారింది. వారు ఇల్లు శుభ్రం చేస్తుండగా, ఇంట్లోని ఒక పాత పెట్టేలో దాచిన రూ. 2 లక్షల నగదు బయటపడింది. కానీ, ఇక్కడే వారికి మరో షాక్‌ తగిలింది. అదేంటంటే..రెండు లక్షల నోట్లు మొత్తం పాత 2,000 రూపాయల నోట్లు కావడం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాహుల్ కుమార్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించి ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

ఊహించకుండా దొరికిన డబ్బుతో వారికి సంతోషించాలా, లేదా బాధపడాలో ఆ కుటుంబానికి అర్థం కాలేదు. అయితే, వాటిని RBIలో డిపాజిట్ చేసే అవకాశం అలాగే ఉంది. కాబట్టి, వారికి కాస్త ఊరట లభించినట్టే.

Biggest diwali Safai of 2025 byu/Rahul_Kumar82 inindiasocial

కాగా, ఈ పోస్ట్‌కి వేలాది మంది స్పందించారు. చాలా మంది తమకూ అలాంటి అదృష్టం వస్తే బాగుండునని కోరుకుంటున్నా అంటూ కొందరు సరదాగా రాశారు. మరొకరు ఈ వార్తపై స్పందిస్తూ.. RBI కార్యాలయానికి వెళ్లి ఈ నోట్లను వెంటనే మార్చుకోవచ్చని సలహా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..