AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cabbage Benefits: క్యాబేజి వ‌ల్ల క‌లిగే ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. నమ్మలేరంతే..

క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్‌లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట,కడుపులో పూతలు తగ్గుతాయి. కాబట్టి కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం త్రాగితే ప్రయోజనం ఉంటుంది.క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో

Cabbage Benefits: క్యాబేజి వ‌ల్ల క‌లిగే ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. నమ్మలేరంతే..
Cabbage Health Benefits
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 12, 2023 | 12:58 PM

Share

ఏడాది పొడవునా లభ్యమయ్యే ఆహారాలలో క్యాబేజీ కూడా ఒకటి. అలాగే మన ఆరోగ్యానికి ఎంతో లాభాన్ని చేకూర్చే ఆకుకూరలలో క్యాబేజీ కూడా ప్రధానమైనది. అయితే చాలా మంది క్యాబేజీని తినేందుకు ఆసక్తి చూపరు. అందుకు కారణం ఏమిటంటే..క్యాబేజీతో మనకు కలిగే ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలియకపోవడమే. బ్రాసికా కుటుంబానికి చెందిన క్యాబేజీలో రెడ్ క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ అనే రెండు రకాలు ఉన్నాయి. ఇక వీటిలోని రెడ్ క్యాబేజీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరకడం వల్ల..మనం ఎక్కువగా గ్రీన్ క్యాబేజీనే కూర చేసేందుకు వాడుతుంటాం. క్యాబేజిని కూరగాను,సలాడ్స్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇక క్యాబేజీ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి చెబితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

గ్రీన్ క్యాబేజీలో క్రోమియం సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అంతేకాక గ్రీన్ క్యాబేజీ శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్, పొటాషియం, తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజీని అందరూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎన్నో పోషకాలు ఉన్న క్యాబేజీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం..

క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు:

క్యాబేజీని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాక కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. క్యాబేజిలో ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉండడం వలన కడుపు మంటను తగ్గించటంలో సహాయపడుతుంది. క్యాబేజిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయటంలో సహాయపడి ఫ్రీరాడికల్స్‌ను నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఈ మధ్య చేసిన పరిశోధనల్లో క్యాబేజీలో అల్జీమర్స్‌ని నిరోధించే లక్షణాలు ఉన్నట్టు కనుగొన్నారు పరిశోధకులు. అయితే ఈ లక్షణాలు రెడ్ క్యాబేజీలో మాత్రమే ఉన్నాయి. అల్జీమర్స్ సమస్యను నివారించే విటమిన్ K రెడ్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

క్యాబేజీ రసంలో గ్లూటమిన్ అనే కంటెంట్‌లో యాంటీ అల్సర్ గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల కడుపులో మంట,కడుపులో పూతలు తగ్గుతాయి. కాబట్టి కడుపు మంట ఉన్నప్పుడు క్యాబేజీ రసం త్రాగితే ప్రయోజనం ఉంటుంది.క్యాబేజీని క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఎంత క్యాబేజీ సూప్ అయినా త్రాగవచ్చు. బరువు పెరుగుతామనే భయం అవసరం లేదు. క్యాబేజీలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియ బాగా జరిగి మలబద్దకం వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వలన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షించి వృద్దాప్య ఛాయలను నెమ్మదింపచేస్తుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజు క్యాబేజీని తింటే పాలు బాగా పడతాయి. క్యాబేజీలో సమృద్ధిగా ఉండే ల్యాక్టిక్ ఆమ్లం గొంతు నొప్పి నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తాగినా దగ్గు తొందరగా తగ్గిపోతుంది. క్యాబేజి రసం త్రాగలేని వారు కొంచెం పంచదార వేసుకోవచ్చు. అయితే పంచదార వేసుకోకుండా త్రాగితేనే మంచిది. కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు అయినా క్యాబేజీని తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.