Immune Sytem: వంటిల్లే పౌష్టికాహారశాల.. రోగ నిరోధక శక్తిని పెంపొందించే అద్భుత ఆహారాలు ఇవే..
శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడంతో అనేక సమస్యలకు గురవుతుంటాం. శారీరక వ్యాయామం చేయడానికి బద్ధకించడంతో ఊబకాయం కూడా పెరుగుతుంది. అలాగే ఆహార నియమాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. కానీ శీతాకాలంలో వంటింట్లోనే ఉండే అద్భుత ఆహారాలతో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు, శరీరానికి అవసరమయ్యే పౌష్టికాహారం కూడా సమపాలల్లో అందుతుంది. వంటింట్లో దొరికే ఆ ఆహారాలేంటో చూద్దాం