Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot and Spicy Chillies: మిర్చి ఎందుకు మంట, వేడిని పుట్టిస్తాయి తెలుసా..? నోరు మంట పుడితే నీరుకి బదులు వీటిని ఉపయోగించండి

Hot and Spicy Chillies: భారతీయుల వంటకాల్లో మిరపకాయలు లేని వంటను ఊహించడం సాధ్యం కాదు. ఎరుపు, పచ్చి మిర్చి రెండింటిని వంటల్లో ఉపయోగిస్తారు. మిరపకాయ ఆహారపదార్ధాలను..

Hot and Spicy Chillies: మిర్చి ఎందుకు మంట, వేడిని పుట్టిస్తాయి తెలుసా..? నోరు మంట పుడితే నీరుకి బదులు వీటిని ఉపయోగించండి
Chillies Hot And Spicy
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2021 | 1:19 PM

Hot and Spicy Chillies: భారతీయుల వంటకాల్లో మిరపకాయలు లేని వంటను ఊహించడం సాధ్యం కాదు. ఎరుపు, పచ్చి మిర్చి రెండింటిని వంటల్లో ఉపయోగిస్తారు. మిరపకాయ ఆహారపదార్ధాలను రుచికరంగా చేస్తుంది. మిరపకాయలు ఎరుపు లేదా ఆకుపచ్చగా ఉన్నా.. కారంగా ఉంటాయి. వీటిని తిన్న తర్వాత నోరు మండుతుంది.. కళ్ళ నుండి నీరు వస్తుంది. మిరపకాయను ఎక్కువగా తింటే కడుపులో కూడా మంట వస్తుంది. అంతేకాదు కొంతమందికి మిరపకాయలు కోసినా.. కొత్త కారం, పచ్చడి వంటివి తిన్నా చేతులు మంట పెడతాయి. అప్పుడు మీరు మీ చేతులను ఎన్నిసార్లు నీటిలో ఉంచినా మంట తగ్గదు. అసలు ఈ మిరపకాయలు ఇంత కారంగా ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు మిర్చి వలన వచ్చే చేతుల మంటను నీరు ఎందుకు తగ్గించదు తెలుసా..!

మిరపకాయలు ఎందుకు ఘాటుగా ఉంటాయంటే..

క్యాప్సైసిన్ సహజంగా మిరపకాయ మరియు మిరపకాయ గింజలలో కనిపిస్తుంది. ఇది మిరపకాయలు కారం, వేడి రుచిని కలిగిస్తుంది కాప్సైసిన్ నాలుక, చర్మంపై సిరలపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో క్యాప్సైసిన్ రక్తంలో సబ్‌స్టాన్స్ పి అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది మెదడులో మంట, వేడిని స్పందింపజేస్తుంది. అందుకనే మిరప తిన్న వెంటనే లేదా కొంచెం సేపటికి ఒక వ్యక్తి మంట వేడిని ఫీల్ అవుతాడు.

మంట నీటి ద్వారా  తగ్గదు:

మిరపకాయ మసాలా ఘాటు నోటికి తగిలిన తర్వాత నీరు త్రాగడం వలన మంట తగ్గదు ఎందుకంటే .. మిరపలో ఉన్న క్యాప్సైసిన్ నీటిలో కరగదు కనుక మంట తగ్గదు. అందువలన మిరప తో నోరు మండినా.. చేతులు మంట వచ్చినా.. ఆ మంటను తగ్గించడానికి పాలు, పెరుగు, తేనె లేదా చక్కెరను ఉపయోగించాలి.

ఎవరు మిరపకాయకు దూరంగా ఉండాలంటే..

*మిరపకాయలు ఎక్కువగా వాడడం వలన ఆస్తమా పై ప్రభావం చూపించే అవకాశం ఉంది కనుక ఆస్తమా బాధితులు అయితే మిరపకాయకు దూరంగా ఉండడం మంచిది.. *అల్సర్ ఉన్న రోగులు మిరపకాయలు తినకూడదు. *పైల్స్ సమస్య బాధితులు మిరపకాయలు తీసుకోవడం మానుకోవాలి *పచ్చి మిర్చిని అధికంగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి.

Also Read:  హరీష్ రావు‌పై సంచలన ఆరోపణలు చేసిన ఈటెల.. బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్..

స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే కామద ఏకాదశి ఎప్పుడు? పూజా విధానం
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
ఏప్రిల్‌ నెలలో వచ్చే సరికొత్త స్మార్ట్‌ ఫోన్లు.. ఫీచర్స్‌ ఇవే..!
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం