World Coconut Day: కొబ్బరితో కోటి లాభాలు.. ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఆ ప్రయోజనలేంటో తెలుసుకుందామా.!
World Coconut Day: మనిషి ఆరోగ్యానికి అవసరయ్యే వాటన్నింటినీ ప్రకృతి మనకు సహజంగానే అందించింది. కానీ మనమే ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను...
World Coconut Day: మనిషి ఆరోగ్యానికి అవసరయ్యే వాటన్నింటినీ ప్రకృతి మనకు సహజంగానే అందించింది. కానీ మనమే ప్రకృతి ప్రసాదించిన వాటిని పక్కన పెట్టి డబ్బులు ఖర్చు చేసి మరీ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాము. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ల పేరుతో అనారోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాము. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి ఒకటి. కొబ్బరి ఆవష్యకతను, కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలపై అందరిలోనూ అవగాహన కలిపించేందుకు గాను ప్రతీ ఏటా సెప్టెంబర్ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవం (వరల్డ్ కొకనట్ డే)గా నిర్వహిస్తారు. మరి ఈ సందర్భంగా కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దామా..!
* పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.
* కొబ్బరిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగ నిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి.
* కొబ్బరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కొబ్బరి కీలకపాత్ర పోషిస్తుంది.
* కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇక కొబ్బరిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. పేగుల్లో కదలికలు బాగుంటాయి. దీంతో మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా పైల్స్ వంటి సమస్యలతో బాధపడుతోన్న వారికి ఉపశమనం లభిస్తుంది.
* పొడి చర్మం, వెంట్రుకలు చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతోన్నవారికి కొబ్బరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మంలో తేమను పెంచడంలో కూడా కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. కొబ్బరిలో ఉండే మోనోలారిన్, లారిక్ యాసిడ్‌లు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు తగ్గుతాయి.
Chanakya Niti: నాయకుడిగా ఉండాలంటే.. ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి.. అవేంటంటే!