AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. వెంటనే ఈ 5 పదార్థాలను పక్కన పెట్టండి..!

Health Tips: మీరు శరీర బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. తప్పనిసరిగా కొన్ని ఆహార పదార్థాలను మీ దరికి చేరనివ్వొద్దు. ఈ జాబితాలో ఎలాంటి పదార్థాలున్నాయో ఓసారి చూద్దాం.

Weight Loss Tips: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. వెంటనే ఈ 5 పదార్థాలను పక్కన పెట్టండి..!
Weight Loss
Venkata Chari
|

Updated on: Feb 07, 2022 | 1:34 PM

Share

Weight Loss Tips: బరువు తగ్గాలని మీరు ప్రయత్నిస్తున్నారా.. అయితే కొన్ని ఆహార పదార్థాలను(Weight Loss Foods) అస్సలు మీ దరి చేరనివ్వొద్దు. అలాగే బరువు తగ్గాలనే(Weight Loss) ప్రక్రియ జిమ్‌లో నుంచి కాదు.. అది మన వంటగది నుంచే మొదలవుతుంది. అవునండీ.. మనం తినే ఆహారంపైనే మన శరీర బరువు పెరగడం తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. నిజంగా మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. లేదంటే వ్యాయామశాలలో కేలరీలు బర్న్ చేస్తున్నా కానీ, కొవ్వు మాత్రం శరీరం నుంచి పోదు. అందుకే ముందు ఆహారం(Health Tips)పై కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి.

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఐదు ఆహార పదార్థాలను అస్సలు మీ దరికి చేరనివ్వకండి. ఈ జాబితాలో ఎలాంటి పదార్థాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

రెడ్ మీట్: ఇది ప్రోటీన్, విటమిన్ బీ12, ఐరన్‌తో నిండి ఉన్నప్పటికీ, రెడ్ మీట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. ఇది మిమ్మల్ని గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్లకు గురయ్యేలా చేస్తుంది. అంతే కాదు బరువు పెరగడానికి కూడా దారి తీస్తుంది. రెడ్ మీట్‌ను ఇతర ఆరోగ్యకరమైన ప్రోటీన్‌ ఫుడ్స్‌తో భర్తీ చేయండి. మీ రోజువారీ ప్రోటీన్ మూలాన్ని పొందడానికి మీరు మీ ఆహారంలో సీఫుడ్స్, ఆర్గానిక్ పౌల్ట్రీ, మొక్కల ఆధారిత ఆహారాలను మీ డైట్‌లో చేర్చవచ్చు.

జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు: మీ బరువు తగ్గించే లక్ష్యాన్ని చేరుకోవాలంటే జంక్, ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా పక్కనపెట్టాలి. వీటికి బదులుగా మీరు పండ్లు, ఓట్స్, సలాడ్‌లు, బాదం లేదా వాల్‌నట్‌లను ఎంచుకోవచ్చు.

చక్కెర అధికంగా ఉండే పానీయాలు: చక్కెర పానీయాలు మీ దాహాన్ని తీర్చడానికి ఉద్దేశించినవి కావు. బదులుగా అవి మీ కేలరీల సంఖ్యను విపరీతంగా పెంచుతాయి. హెల్త్‌లైన్ ప్రకారం, చక్కెర అధికంగా ఉండే పానీయాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత, లెప్టిన్ నిరోధకతను పెంచుతాయి. ఒకవేళ తీపి పానీయాన్ని తినాలని లేదా తాగాలని అనుకుంటే మీ టీ లేదా కాఫీలో చిటికెడు బెల్లం జోడించడం ఉత్తమం.

వైట్ బ్రెడ్ : శుద్ధి చేసిన ధాన్యాలు ఏ రూపంలో ఉన్నా మీకు మంచిది కాదు. వైట్ బ్రెడ్ శుద్ధి చేసిన ధాన్యాల నుంచి తయారవుతుంది. ఇందులో పోషకాహారం, ఫైబర్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో చక్కెర కూడా అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి మంచిది కాదు. బదులుగా మీరు గోధుమ రొట్టె తీసుకోవచ్చు.

ఆల్కహాల్: ఇది పోషక ప్రయోజనాలను కలిగి ఉండదు. బరువు తగ్గాలని ఎదురుచూస్తుంటే మాత్రం మద్యపానానికి దూరంగా ఉండటం ఉత్తమం. దీనికి బదులు తాజాగా తీసిన జ్యూస్‌లు లేదా ఏదైనా చక్కెర రహిత మాక్‌టెయిల్‌ని తాగవచ్చు.

బరువు తగ్గడం విషయానికి వస్తే స్వీట్లు, చాక్లెట్లు పూర్తిగా పక్కనపెట్టాలి. అందుకు బదులుగా డార్క్ చాక్లెట్ తీసుకుంటే మంచింది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల చక్కెర తినాలనే కోరికలు తగ్గుతాయి. అలాగే మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Also Read: IND vs WI: టీమిండియా దెబ్బకు మరింత దిగజారిన వెస్టిండీస్.. జట్టుతో చేరిన చెత్త రికార్డులేంటంటే?