Raisins Side Effects: ఎండుద్రాక్షను అతిగా తింటున్నారా.. వీటివలన శరీరంలో కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోండి..

Raisins Side Effects: ఎండుద్రాక్షలు తినే ఆహారంలో చేర్చుకుంటే.. అదనంగా అనేక పోషకాలను(nutrients) శరీరానికి అందిస్తాయి. అంతేకాదు.. అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. అయితే నచ్చివి ఎక్కువ తినడం...

Raisins Side Effects: ఎండుద్రాక్షను అతిగా తింటున్నారా.. వీటివలన శరీరంలో కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోండి..
Raisins Side Effects
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2022 | 12:10 PM

Raisins Side Effects: ఎండుద్రాక్షలు తినే ఆహారంలో చేర్చుకుంటే.. అదనంగా అనేక పోషకాలను(nutrients) శరీరానికి అందిస్తాయి. అంతేకాదు.. అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయి. అయితే నచ్చివి ఎక్కువ తినడం.. నచ్చలేదంటూ అసలు తినకపోవడం రెండు శరీరానికి హానిని కలుగుజేస్తాయి. ఈ విషయంలో ఎండు ద్రాక్షలు కూడా మినహాయింపు కాదు.. వీటిని అతిగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నయని కొంతమంది నిపుణుల హెచ్చరిస్తున్నారు. అవును ఎండుద్రాక్షలు తినడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రత్యేకించి శీతాకాలం(Winter Season)లో ఎవరికైనా అధిక క్యాలరీ అవసరాలు ఉన్నప్పుడు, సాధారణంగా మధ్యాహ్న సమయంలో భోజన కోరికలను తీర్చడానికి మేలైన ఎంపిక ఎండుద్రాక్ష. ఎందుకంటే ఎండుద్రాక్ష తక్షణమే శక్తినిస్తుంది. కనుక శీతాకాలంలో శారీరకంగా శక్తి లేదు అనుకున్నవారికి మంచి ఎంపిక ఎండుద్రాక్ష. వీటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం మరింత మేలు చేకూరుస్తుంది. ఎండుద్రాక్షలో చాలా ముఖ్యమైన పోషకాలు, ఫైబర్ నిండి ఉన్నాయి, ఇవి మొత్తం ఆరోగ్యాన్ని నిర్ధారించేటప్పుడు మీ జీర్ణవ్యవస్థను ట్రాక్‌లో ఉంచగలవు, అయితే వీటిని కొన్నిసార్లు ఎక్కువ మొత్తంలో తింటారు. ఇలా అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఆరోగ్య నిపుణుడు చెబుతున్నారు.

నిజానికి “ఎండుద్రాక్ష పోషకాలతో నిండి ఉంది. బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే అధికంగా తింటే సమస్య కావచ్చు. కనుక మీరు ఎన్ని ఎండు ద్రాక్షలు తీసుకుంటున్నారనే దానిపై తప్పని సరిగా అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. ముఖ్యంగా శరీరంలో క్యాలరీలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు కిస్మిస్ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ” జాగృతి బరార్, క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ముంబై (మలాడ్) ఎగ్జిక్యూటివ్ న్యూట్రిషనిస్ట్ చెప్పారు. రొజూ ఎండుద్రాక్షను తినే ఆహారంలో చేర్చుకోవలనుకుంటే… 40-50 gm మించకూడదు.

ఎండుద్రాక్ష తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు హానికరం:

ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు వీటిలోని ఫైబర్ ఎక్కువగా ఉండడంవలన ఇది ఇతర పోషకాల శోషణను తగ్గిస్తుంది. డైటరీ ఫైబర్స్ మన శరీరంలోని అదనపు ద్రవాన్ని గ్రహిస్తాయి. అందుకనే డయేరియా చికిత్సలో ఎండు ద్రాక్ష మంచి సహాయకారి. అయినప్పటికీ, ఎక్కువ నీరు త్రాగకుండా వీటిని ఎక్కువగా తీసుకోవడం నిర్జలీకరణం, అజీర్ణం, ఇతర కడుపు రుగ్మతలకు కారణం కావచ్చు.

ఎండుద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల కణాలకు నష్టం:

ఎండుద్రాక్షలో పాలీఫెనాల్స్, బయోఫ్లేవనాయిడ్స్ , ఫైటోన్యూట్రియెంట్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, అయితే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండుద్రాక్షను మితంగా తీసుకోవాలి. మొదట అవి ఫ్రీ రాడికల్స్‌తో సంకర్షణ పడతాయి. అనంతరం వాటి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాల మీద పనిచేయడం ప్రారంభిస్తాయి. ఆరోగ్యకరమైన కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని ప్రేరేపించేలా పనిచేస్తాయి.

బరువు పెరగడానికి కారణం కావచ్చు:

ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గించే డైట్‌లో కనుక చేర్చుకుంటే.. నష్టం కలుగుతుంది. శరీరంలోని అదనపు కిలోల బరువుని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తువారు తప్పని సరిగా ఎండుద్రాక్షను మితంగా తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిని పెంచవచ్చు:

ఎండుద్రాక్షలో చక్కెరలు, కేలరీలు ఎక్కువగా ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకునే ముందు కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మితంగా తింటే, అవి తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) ఆహారంగా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.

Also Read:

: బూస్టర్ డోస్‌ తీసుకున్న తర్వాత చాలామందిలో ఈ సైడ్‌ ఎఫెక్ట్‌.. ఎందుకంటే..?