AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Recipe : వెల్లుల్లి రెసిపీని ట్రై చేయండి.. టేస్ట్ చూశారంటే అస్సలు వదలరు..

Garlic Recipe : ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో అందరికి తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా వెల్లుల్లి రైతా తిన్నారా..

Garlic Recipe : వెల్లుల్లి రెసిపీని ట్రై చేయండి.. టేస్ట్ చూశారంటే అస్సలు వదలరు..
Garlic Recipe
uppula Raju
|

Updated on: Jul 17, 2021 | 7:31 PM

Share

Garlic Recipe : ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో అందరికి తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా వెల్లుల్లి రైతా తిన్నారా.. కొంతమందికి దీని గురించి తెలియకపోవచ్చు కానీ తెలిసినవారు దీనిని అస్సలు వదులుకోరు. మీరు బిర్యానీ, పులావ్‌లను ఇష్టపడితే వీటితో పాటు రెస్టారెంట్‌లో దీన్ని ప్రయత్నించవచ్చు. వెల్లుల్లి రైతా బిర్యానీ లేదా సోయా పులావ్‌తో అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. మీరు పులావ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వెల్లుల్లి రైతాను కూడా తయారుచేసుకోండి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసినవి: 200 గ్రాముల తాజా పెరుగు, రెండు కట్టల ఆకుపచ్చ కొత్తిమీర, 7 నుంచి 8 మందపాటి వెల్లుల్లి రిబ్బలు, లవంగాలు 4, 5 పచ్చిమిర్చి, చిటికెడు ఆసాఫోటిడా, సగం టీస్పూన్ జీలకర్ర, సగం టీస్పూన్ పుదీనా పొడి లేదా 6 నుంచి7 తాజా పుదీనా ఆకులు, క్వార్టర్ టీస్పూన్ నలుపు ఉప్పు, రుచి ప్రకారం తెలుపు ఉప్పు అవసరమవుతాయి.

రైతాను ఎలా తయారు చేయాలి

1 రైతా చేయడానికి మొదట పెరుగును బాగా చిలకాలి. పెరుగు పుల్లగా ఉంటే దానికి కొద్దిగా పాలు కలపండి. నీటిని మాత్రం కలపవద్దు. ఎందుకంటే పెరుగు మజ్జిగ లాగా పలుచగా మారుతుంది. పాలు కలిపితే రుచితో పాటు స్థిరత్వం ఉంటుంది. పుల్లటి రుచిని తగ్గిస్తుంది. మీ రుచికి అనుగుణంగా పెరుగును సిద్దం చేసుకోండి.

2 తరువాత పచ్చి కొత్తిమీర, పచ్చిమిర్చిని నీటితో కడగాలి. అన్నిటిని మెత్తగా రుబ్బుకోవాలి. వీటిని పచ్చడి మాదిరి చేసుకోవాలి. దానిని పెరుగులో వేసి మరోసారి మొత్తం కలపండి.

3 తరువాత పెరుగు అందమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. కొంత సమయం ఫ్రిజ్‌లో ఉంచండి. అప్పటి వరకు పులావ్ ఉడికించాలి. తరువాత ఈ రైతా పాపడ్, ఊరగాయతో వేడి వేడిగా లాగించండి.

4. వెల్లుల్లి సలాడ్ చేయడానికి ఎల్లప్పుడూ తాజా పెరుగును వాడాలి. పాత పెరుగును ఉపయోగిస్తే రైతా అంత రుచిగా ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Income Tax : ఆదాయ పన్ను ఇప్పుడు పోస్టాఫీసు ద్వారా కూడా చెల్లించవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

Invention: మాట పడిపోయిన వ్యక్తి భావాలను ప్రపంచానికి చెప్పగలిగే విజయవంతమైన విధానాన్ని ఆవిష్కరించిన వైద్యులు!

Viral Video: ఎర కోసం కొట్టుకున్న హైనాలు, చిరుత.. మాములుగా లేదుగా.. షాకింగ్ వీడియో మీకోసమే!