Migraine: ఈ ఆహార పదార్థాలతో మైగ్రేన్ సమస్యను చెక్ పెట్టోచ్చు.. అవెంటో తెలుసా..

ప్రస్తుతం చాలా మందికి మైగ్రేన్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను సాధారణ వ్యాధిగా మారింది. మైగ్రేన్ తలలో

Migraine: ఈ ఆహార పదార్థాలతో మైగ్రేన్ సమస్యను చెక్ పెట్టోచ్చు.. అవెంటో తెలుసా..
Migren
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 16, 2021 | 8:21 PM

ప్రస్తుతం చాలా మందికి మైగ్రేన్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను సాధారణ వ్యాధిగా మారింది. మైగ్రేన్ తలలో ఒకేవైపు తీవ్రంగా నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా.. మైగ్రేన్ వేధిస్తున్న సమయంలో బలహీనంగా మారిపోవడం.. మైకం వచ్చినట్లుగా ఉండడం, వాంతులు జరుగుతుంటాయి. అయితే ఇది తాత్కాలికంగా ఉండే సమస్య కాదు.. ఒక్కొసారి రెండు రోజులు భరించలేనిదిగా ఉంటుంది. అయితే మనం రోజూ తీసుకునే ఆహారంలో మార్పు జరగడం వలన మైగ్రేన్ సమస్య వస్తుంది. అంతేకాకుండా.. ఒత్తిడి, ఉద్రిక్తత, శరీరంలో హార్మోన్ల మార్పు వలన కలిగే నాడీ పరిస్థితి. తలనొప్పి, మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని ఇటీవల పలు అధ్యాయనాల్లో తెలీంది. నిజాలు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మైగ్రేన్‌ను నివారించడంలో సహాయపడతాయి.

ఆహార పదార్థాలు.. సాల్మన్ ఫిష్: సాల్మన్ చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. చేపల వినియోగం మైగ్రేన్ ట్రిగ్గర్‌లను కూడా నిరోధిస్తుంది.

డ్రై నట్స్.. ఆరోగ్యానికి మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన పోషకాలు డ్రై నట్స్‏లో పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మైగ్రేన్ రాకుండా ఉంటుంది. బాదం, జీడిపప్పు, వాల్నట్, గుమ్మడికాయ గింజలను స్నాక్స్‏గా తీసుకోవచ్చు.

ఆకుపచ్చ కూరగాయలు: బచ్చలికూర వంటి ఆకుపచ్చ ఆకు కూరలు మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి చాలా సహాయపడతాయి. బచ్చలికూరలో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి, మెగ్నీషియం ఉంటాయి. ఆకుపచ్చ కూరగాయలు మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.

కెటోజెనిక్ ఆహారాలు: కీటో ఆహారాలు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కొవ్వు అధికంగా ఉండటం వల్ల మైగ్రేన్ సమస్యను తగ్గించవచ్చు. సీఫుడ్, పిండి లేని కూరగాయలు, గుడ్లు వంటి ఆహారాన్ని తినాలి. అయితే కీటో డైట్ ప్రారంభించే ముందు మీ డాక్టర్ లేదా రిజిస్టర్డ్ డైటీషియన్‌ను సంప్రదించాలి.

తలనొప్పి లేదా మైగ్రేన్‌తో బాధపడుతున్నవారు నొప్పిని తగ్గించుకోవడానికి తమను తాము హైడ్రేట్‏గా ఉంచుకోవాలి. రోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి.

Also Read: Telugu Actor Annapurna: కూతురు కీర్తిని జ్ఞాపకం చేసుకున్న అన్నపూర్ణ.. ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ తెలియదంటూ కన్నీరు

Nayanthara: నెట్‏ఫ్లిక్స్‏లోకి “బాహుబలి” వెబ్ సిరీస్.. కీలకపాత్రలో లేడి సూపర్ స్టార్.?