AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits of Jaggery: ఉదయాన్నే బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు..

Jaggery Health benefits: ఉరుకులు పరుగుల దైనందన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ఇలాంటి క్రమంలో కొన్ని చిట్కాలను పాటిస్తే.. సులువుగా జబ్బుల

Health Benefits of Jaggery: ఉదయాన్నే బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే షాకవుతారు..
Jaggery
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2021 | 8:48 PM

Share

Jaggery Health Benefits: ఉరుకులు పరుగుల దైనందన జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ఇలాంటి క్రమంలో కొన్ని చిట్కాలను పాటిస్తే.. సులువుగా జబ్బుల నుంచి బయటపడేలా చేస్తాయి. వంటింట్లో ఉన్న పదార్థాలను తినడం ద్వారా సులువుగా జబ్బులనుంచి బయటపడొచ్చు. అలాంటి ఔషధంలో బెల్లం ఒకటి. బెల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. చెక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే.. చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బెల్లంను ఆయుర్వేద చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. దీంతో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వారు బెల్లం.. తినాలని పేర్కొంటుంటారు. ఎర్ర రక్త కణాలని వృద్ధి చేసి ఆరోగ్యంగా మార్చడంలో సహకరిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు బెల్లం ఎక్కువగా తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఇంత మేలు చేసే బెల్లాన్ని ప్రతి రోజు ఉదయాన్నే తింటే ఎంతో మంచిది. రోజూ 50 గ్రాముల బెల్లం తీసుకుంటే ఎంతో మంచిదని.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లం ప్రయోజనాలు.. ఉదర సమస్యలను తొలగించడంలో బెల్లం సహకరిస్తుంది. బెల్లం నిత్యం తినడం వల్ల కడుపు నొప్పి సమస్యలు, జీర్ణ సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ లాంటి వాటికి చెక్ పెట్టొచ్చని పేర్కొంటున్నారు. బెల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఉదయం వేళ అల్లం, బెల్లం కలిపి తీసుకున్నా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. బెల్లంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా చేయడంలో సాయపడతాయి. దీంతోపాటు చెక్కర ఉపయోగించకుండా.. బెల్లంను ఉపయోగించడం వల్ల రక్త, షుగర్ సంబంధిత అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావున ప్రతీరోజూ ఉదయాన్నే ఎంతోకంత బెల్లం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:

Holy Basil Tea: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? అయితే మీ డైట్‌లో ‘తులసి టీ’ చేర్చాల్సిందే.. !

Migraine: ఈ ఆహార పదార్థాలతో మైగ్రేన్ సమస్యను చెక్ పెట్టోచ్చు.. అవెంటో తెలుసా..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..