Holy Basil Tea: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? అయితే మీ డైట్‌లో ‘తులసి టీ’ చేర్చాల్సిందే.. !

బరువు తగ్గేందుకు మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొంతమంది కచ్చితమైన డైట్‌ను ఫాలో చేస్తే.. మరికొందరు జిమ్‌లో కుస్తీలు పడుతుంటారు.

Holy Basil Tea: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? అయితే మీ డైట్‌లో 'తులసి టీ' చేర్చాల్సిందే.. !
Tulsi tea
Follow us

|

Updated on: Jul 16, 2021 | 11:43 PM

Health Benefits of Tulsi Tea:తులసిని పురాతనంగా వాడుతూనే ఉన్నాం. ఇది ఆయుర్వేదంలో శతాబ్దాలుగా వాడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు అనేక రకాల ఇన్ఫెక్షన్‌ల నుంచి కాపాడడంలో సహాయపడుతోంది. తులసిని ఏ విధంగా తీసుకున్నా అది మనకు చాలా మేలు చేస్తోంది. తులసి ఆకులను నేరుగా తినవచ్చే. అలాగే తులసి ఆకులతో టీని కూడా చేసుకొని తాగవచ్చు. అయితే, తులసి బరువు తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి తులసి మనకు ఎలా ఉపయోగపడుతుందో వివరంగా తెలుసుకుందాం.

జీవక్రియ: తులసి ఆకులు మన జీవక్రియను పెంచుతాయి. కేలరీలను వేగంగా కరిగించి జీవక్రియను వేగం చేయడంలో తులసి కీలకంగా పనిచేస్తోంది.

బరువు తగ్గడం: మీరు బరువు తగ్గాలంటే నిర్ణయించుకుంటే.. కచ్చితంగా తులసి టీ తాగాల్సిందే. మనం తిన్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణ చేయడంతోపాటు, కేలరీలను వేగంగా కరిగించేందుకు సహాయపడుతోంది. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించి మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతోంది.

ఆందోళనలను తగ్గిస్తుంది: తులసి టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆందోళనను తగ్గించేందుకు సహాయపడుతోంది. అలాగే మన శరీరాన్ని చల్లబరిచేందుకు ఉపయోగపడుతోంది.

లివర్ ఆరోగ్యాన్ని కాపాడడంలో: లివర్ ఆరోగ్యాన్ని కాపాడడంలో తులసి టీ కీలకంగా పనిచేస్తోంది. సాధారణంగా లివర్‌లో ఎంజైమ్‌లు పెరిగితే.. అవి లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి ఎంజైమ్‌లను తగ్గించేందుకు తులసి టీ బాగా పనిచేస్తోంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తులసి టీ జీవక్రియతోపాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జలుబు, ఫ్లూలను తగ్గించేందుకు: జలుబు లేదా ఫ్లూతో బాధపడుతున్నప్పుడు కచ్చితంగా తులసి టీ లేదా తులసి పాలు తీసుకోవచ్చు. దీనివల్ల ముక్కు, ఛాతీలో ఫ్లూ లేదా జలుబు నుంచి తక్షణ ఉపమశమనం లిభిస్తుంది.

ఆరోగ్యవంతమైన గుండె కోసం: కాలేయం లాగే తులసి టీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును నియంత్రించడంతో గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. తులసి టీ గుండె సమస్యలను దూరం చేసేందుకు సహాయపడుతోంది.

ఇంట్లోనే తులసి టీ తయారీ.. కావాల్సిన పదార్థాలు: 1. 2 స్పూన్‌ల తులసి విత్తనాలు 2. 2 గ్లాసుల చల్లటి నీరు 3. 2 స్పూన్‌ల నిమ్మరసం 4. 5-6 పుదీనా ఆకులు

తయారీ విధానం: ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో తులసి గింజలు వేసి 2 గంటలు నానబెట్టాలి. అనంతరం వీటిని వడకట్టుకుని చల్లటి నీరు పోసి బాగా కలుపాలి. అనంతరం దీనిలో నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి తాగాలి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు