Corona Virus: పొంచి ఉన్న కరోనా థర్డ్‌వేవ్.. వాహకాలుగా మారుతున్న టీ స్టాల్స్, ఏటీఎంలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే

Corona Virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ ముంగిట నిలిచిందని.. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం..

Corona Virus: పొంచి ఉన్న కరోనా థర్డ్‌వేవ్.. వాహకాలుగా మారుతున్న టీ స్టాల్స్, ఏటీఎంలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే
Corona
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 16, 2021 | 5:13 PM

Corona Virus:ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ ముంగిట నిలిచిందని.. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక భారత్ లో కూడా సెకండ్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ దిశగా అడుగులు పడుతున్నాయని ఎయిమ్స్ సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర లో థర్డ్ వేవ్ ముంగిట నిలిచిందనే సంకేతాలు ద్వారా తెలుస్తుందని అక్కడ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది. ఈ కరోనా వ్యాప్తి తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వాహకాలుగా ఎక్కువగా టి సెంటర్స్ , ఏటీఎం సెంటర్స్ నిలుస్తున్నాయి. ఎవరికైనా కొంచెం సమయంలో దొరికే చాలు టి సెంటర్స్ వద్దకు చేరుకుంటారు.. కరోనా నివారణ చర్యల్లో భాగంగా మనిషికి మనిషి దూరం ఉండాలనే నిబంధన ఉన్నా ఇప్పుడు కూడా టీ సెంటర్స్ వద్దకు వచ్చే వారి సంఖ్య భారీగానే ఉంటుంది.. దీంతో తాజాగా నమోదవుతున్న కేసుల్లో టీ స్టాల్స్ నుంచి వ్యాప్తిస్తున్నవి కూడా ప్రధాన భాగంగా ఉన్నాయి. అక్కడకు వచ్చే వారు భౌతిక దూరం పాటించడం లేదు.. అంతేకాదు.. టీ తగిన తర్వాత వాడుతున్న గ్లాస్ శుభ్రం చేసే విధానం కూడా సరిగ్గా ఉండడంలేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొరోనా వైరస్ గాజు పదార్ధం మీద దాదాపు 4 గంటలు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో గ్లాస్ శుభ్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.. అందుకే కరోనా వ్యాప్తికి ముఖ్య కారణాల్లో ఒకటిగా టి సెంటర్స్ నిలుస్తున్నాయి. ప్రజల్లో భయం తగ్గడం తో పాటు.. అవగహన లేమి కూడా కరోనా వైరస్ వ్ వ్యాప్తికి ఒక కారణంగా నిలుస్తోంది.

కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోడానికి మరో కారణంగా ఏటీఎం సెంటర్స్ నిలుస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల నమోదవుతున్న కేసుల్లో చాలా వరకూ లక్షణాలు లేకుండా వస్తున్నవే.. దీంతో చాలా మంది తమ దైనందిన కార్యకార్యక్రమాలను నిర్వహించుకుంటూనే ఉన్నారు.. డిజిటల్ చెల్లింపులపై చాలా మందికి అవగాహన లేకపోవడం.. చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి బడా వ్యాపారస్తులు కూడా వినియోగదారుడి నుంచి డిజిటల్ చెల్లింపులు వద్దనికి క్యాష్ నే కోరుతున్నాయి. దీంతో సామాన్యుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఏటీఎం ల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. అయితే వారిలో లక్షలు లేని కరోనా సోకినా వ్యక్తి ఉంటె.. ఆ ఏటిఎం రూమ్ నుంచి మరికొందరికి స్ప్రెడ్ అవుతుంది.. అదిఎలా అంటే.. కరోనా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్వాస ద్వారా బయటకు వచ్చే తుంపర్లు.. ఆ వ్యక్తి గది ఎంత దూరం ఉంటుందో అంత వరకు వ్యాప్తిచెంది.. మరో వ్యక్తికి సోకుతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇంకా గాలిలో వైరస్‌కు సంబంధించిన సూక్ష్మ కణాలు ఉన్నాయని.. దీనిద్వారానే వ్యాధి వేగంగా వ్యాప్తిచెందుతోందని వారు పేర్కొంటున్నారు.అంటున్నారు.. ఇక ఏటీఎంల నుంచి మనీ తీసే సమయంలో స్క్రీన్ ను తాకడం.. స్విచ్ ల పై చేయి వేయడం ద్వారా కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. అందుకనే ఏటీఎం లకు వెళ్లడం సాధ్యమైనంత వరకూ అవాయిడ్ చేసి.. డిజిటల్ చెల్లింపులకు వెళ్ళితే అది మీకు మీ కుటుంబానికి సమాజానికి అంత మంచిది.. ఇక తప్పని సరిగా ఏటీఎం ల వద్దకు వెళ్లాల్సి వస్తే.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.. శానిటైజర్ ను టిస్యూ పేపర్స్ ను తీసుకుని వెళ్ళాలి.. ఏటీఎంల వద్ద క్యాచ్ డ్రా చేసే ముందు అక్కడ ఉన్న స్క్రీన్ ను .. స్విచ్ లకు శానిటైజర్ టిస్యూ తో అప్లయి చేసి.. అప్పుడు క్యాష్ డ్రా చేసుకోవాలి.. అనంతరం కార్డు ను కూడా టిస్యూ తో శుభ్రంగా తుడిచి అప్పుడు జాగ్రత్త చేసుకుంటే మంచిది.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో.. పూర్తిగా కాకపోయినా చాలా వరకూ కరోనా వైరస్ ను వ్యాప్తి చేసే వాహకాలుగా ఏటీఎం లు కాకుండా చూడవచ్చు

Also Read: Ayurveda-Uttareni: ఉత్తరేణి ఔషధాల గని.. బాణ పొట్టను సైతం కరిగించే గుణం దీని సొంతం..