Coconut Oil: ప్రతి రోజూ టీ స్పూన్ చొప్పున కొబ్బరినూనె తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?
బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి నూనె ఒక వరంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలోని గుణాలు శరీరంలో అదనంగా నిల్వ ఉండే క్యాలరీలు ఖర్చవుతూ, కొవ్వు కరిగిపోతుంది. చర్మం నుంచి జీర్ణవ్యవస్థ దాకా, జుట్టు నుంచి గుండె ఆరోగ్య దాకా అన్ని దశల్లో ఇది అద్భుత ఫలితాలిచ్చే ఔషధ గుణాలు కలిగిన సహజ సంపదగా నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరినూనెను సాధారణంగా జుట్టు సంరక్షణకు వినియోగిస్తుంటారు. ఇది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే, కొబ్బరి నూనె చర్మానికి సహజమైన తేమను అందిస్తుంది. అదే కొబ్బరి నూనెను రోజూ ఒక టీ స్పూన్ చొప్పున మీరు తినే ఆహారంలో చేర్చుకుంటే అనేక లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవును, మీరు చదివింది నిజమే.. కొబ్బరినూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.. ఇందులో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయని చెబుతున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉండటం వలన చర్మ సమస్యలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
రోజు రాత్రి నిద్రకు ముందు ఒక టీ స్పూన్ కొబ్బరినూనె తీసుకుంటే ఇది సహజ విరేచన చర్యగా పనిచేస్తుంది. తద్వారా సుఖ విరేచనమవుతుంది. జీర్ణాశయంలో ఉన్న వ్యర్థ పదార్థాలు, విషతత్వాలు బయటకు వెళ్లిపోతాయి. పెద్దపేగు శుభ్రంగా మారుతుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది. అలాగే కొబ్బరినూనె జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనె వాడకంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు దరిచేరవు. ఇందులో ఉండే అన్ శాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆహారంలో భాగంగా కొబ్బరి నూనె వాడకం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొబ్బరి నూనెలోని మీడియం చెయిన్ ఫ్యా టీ యాసిడ్లు గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ రుగ్మతలపై చక్కటి ప్రభావాన్ని చూపిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి నూనె ఒక వరంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలోని గుణాలు శరీరంలో అదనంగా నిల్వ ఉండే క్యాలరీలు ఖర్చవుతూ, కొవ్వు కరిగిపోతుంది. చర్మం నుంచి జీర్ణవ్యవస్థ దాకా, జుట్టు నుంచి గుండె ఆరోగ్య దాకా అన్ని దశల్లో ఇది అద్భుత ఫలితాలిచ్చే ఔషధ గుణాలు కలిగిన సహజ సంపదగా నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








