AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగు త్వరగా తోడుకోవాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..

అలాగే, ప్రస్తుతం చాలా మంది మట్టి పాత్రలను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు మట్టిపాత్రలో పెరుగు తోడు పెడితే అది మరింత రుచితో కమ్మగా ఉంటుంది. అలాగే, తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే  గట్టిగా  తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా  కూడా ఉంటుంది.

పెరుగు త్వరగా తోడుకోవాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ ట్రై చేయండి..
Curd Benefits
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2025 | 8:54 PM

Share

దాదాపు చాలా మందికి పెరుగు అంటే చాలా ఇష్టం..భోజనం తరువాత చివర్లో కాస్త పెరుగన్నం తింటే తప్ప ఆహారం తిన్న అనుభూతి ఉండదు చాలా మందికి. అంతేకాదు.. ఇక పెరుగు తయారీ కూడా చాలా ఈజీ.. వంట చేయడం రానివాళ్లు కూడా ఈజీగా పెరుగు తోడు పెట్టుకోవచ్చు. అయితే, ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. పెరుగు తోడు పెట్టడానికి గోరు వెచ్చటి పాలను తీసుకోవాలి. అలా కాకుండా చల్లటి పాలలో తోడు పెడితే అది పాల‌లానే ఉంటుంది. అలాంటప్పుడు తోడుపెట్టినా తోడుకోకుండా ఉన్న పాలగిన్నెని, ఒక ప్లేట్లో గోరువెచ్చటి నీరు తీసుకుని అందులో పెట్టాలి. తీయటి పెరుగు చిటికెలో తోడుకుంటుంది.

అయితే, ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే..మిగిలిపోయిన పెరుగు మొత్తంలో పాలు పోసేస్తుంటారు చాలామంది… అలా చేయడం వల్ల పెరుగు పుల్లగా తోడుకుంటుంది. అలాకాకుండా స్పూన్ తో కొంచెం పెరుగు తీసుకుని, పాలల్లో వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇలా చేస్తే తీయటి పెరుగు తోడుకుంటుంది.

అలాగే, ప్రస్తుతం చాలా మంది మట్టి పాత్రలను వాడేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు మట్టిపాత్రలో పెరుగు తోడు పెడితే అది మరింత రుచితో కమ్మగా ఉంటుంది. అలాగే, తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే  గట్టిగా  తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా  కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే