Watch: ఊర్లోకి వచ్చిన అరుదైన వింత జంతువు.. జనావాసాల్లో పరుగులు పెడుతూ హల్‌చల్..
బిజ్నోర్‌లో నాథన్ సింగ్ అనే 65 ఏళ్ల రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తన ఇంటి సమీపంలో కూరగాయలు కోస్తుండగా నీల్‌గయ్ అతనిపై దాడి చేసింది. దాని కొమ్ములతో అతని కడుపులో పొడిచింది. దాంతో అతను నేలపై కూలిపోయాడు. తీవ్ర గాయాలైన అతన్ని వెంటనే సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ అతడు మరణించాడు.

ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లాలో జూన్ 11న ఓ నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన నీల్‌గయ్ అనే జంతువు భయానకంగా ప్రవర్తించి కలకలం రేపింది. నీల్‌గయ్ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. బిజ్నోర్‌లో నాథన్ సింగ్ అనే 65 ఏళ్ల రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తన ఇంటి సమీపంలో కూరగాయలు కోస్తుండగా నీల్‌గయ్ అతనిపై దాడి చేసింది. దాని కొమ్ములతో అతని కడుపులో పొడిచింది. దాంతో అతను నేలపై కూలిపోయాడు. తీవ్ర గాయాలైన అతన్ని వెంటనే సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
అక్కడ్నుంచి పరుగులు తీసిన నీల్‌గయ్ అంబేద్కర్ నగర్ ప్రాంతం గుండా దాదాపు అరగంటపాటు హల్‌చల్ చేసింది. ఓ వాహనాన్ని ధ్వంసం చేసి ఇతర ఆస్తులకు కూడా నష్టం కలిగించింది. ఆ తర్వాత నీల్‌గయ్ అదుపుతప్పి ఇనుప గేటును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
यूपी के बिजनौर में इस नीलगाय ने 3 घंटे तक उत्पात मचाया, इसने एक किसान पर हमला कर मार डाला. कई गाड़ियों को तोड़ डाला. इन सब में नीलगाय ख़ुद घायल हो हुआ और उसकी भी मौत हो गई. ये नीलगाय के उत्पात का नजारा है. pic.twitter.com/b1JsFX4Wxt
— Priya singh (@priyarajputlive) June 14, 2025
మృతిచెందిన నీల్‌గయ్ మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ, మున్సిపల్ బృందాలు సహా అధికారులు అరుదైన, ప్రాణాంతకమైన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..