- Telugu News Photo Gallery Weight loss black coffee recipe can lose weight quickly in telugu lifestyle news
శరీరం కదపకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇది తాగితే త్వరగా స్లిమ్ అవుతారు..!
బరువు తగ్గే క్రమంలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు ఫైబర్‌తో కూడిన స్నాక్స్ తింటూ ఉంటారు. ఈ సమయంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమంది అయితే బరువు తగ్గడానికి ఎక్కువగా వ్యాయామాలతో పాటు వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. బరువు పెరగడం అనేది సాధారణమైనప్పటికీ తగ్గడం చాలా కఠినమని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. బరువు తగ్గే క్రమంలో బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Jun 15, 2025 | 6:24 PM

Black Coffee

కాఫీ కొవ్వును కరిగించడంలో, శక్తిని పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.. కాఫీలో కెఫీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాయామ సమయంలో కొవ్వును కరిగించడంతో పాటు.. వర్కవుట్‌ల సమయంలో మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం కాఫీ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

కాల్చిన కాఫీ గింజల్లో వెయ్యి కంటే ఎక్కువగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కాఫీ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలు, లివర్ సమస్యలు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే బ్లాక్ కాఫీలో పొటాషియం, మాంగనీస్, మేగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

కాఫీ మెరుగైన జీవక్రియను అందిస్తుంది. కాఫీ తీసుకోవడం వల్ల శరీర కొవ్వును కాల్చడానికి అవసరమైన జీవక్రియ రేటును పెంచుతుంది. వ్యాయామానికి ముందు కాఫీ తీసుకోవడం వల్ల వ్యాయామం తర్వాత కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తీవ్రమైన వ్యాయామం తర్వాత లాక్టిక్ ఆమ్లం శరీరంలో విడుదల అవుతుంది. ఇది కాఫీ ద్వారా తగ్గుతుంది.

బ్లాక్ కాఫీ రోజూ పరగడుపున తాగడం వల్ల ఫ్యాటీ లివర్, లివర్ సార్కోమాస్ వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. లివర్‌లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడుతుంది. బ్లాక్ కాఫీ అంటే చాలామందికి ఇష్టం. పని ఒత్తిడి తగ్గడమే కాకుండా నీరసం, అలసట వంటివి వెంటనే దూరమౌతాయి. రెగ్యులర్ కాఫీ అంత రుచిగా లేకపోయినా ఆరోగ్యపరంగా చాలా మంచిది.




