- Telugu News Photo Gallery Cinema photos Anushka Shetty Shares Her Mom Reaction After Watching Prabhas Billa Movie
Anushka Shetty : బిల్లా సినిమాలో గ్లామర్ లుక్స్.. అమ్మ చెప్పిన మాట విని షాకయ్యా.. అనుష్క శెట్టి..
నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ అనుష్క శెట్టి. తక్కువ సమయంలోనే దక్షిణాదిలోని స్టార్ హీరోల సరసన నటించింది. అందం, అభినయంతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ తొలినాళ్లల్లో గ్లామర్ పాత్రలతో ఇండస్ట్రీలో రచ్చ చేసింది.
Updated on: Jun 15, 2025 | 6:56 PM

తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు అనుష్క శెట్టి. సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలోని స్టార్ హీరోలతో కలిసి నటించింది. ముఖ్యంగా ప్రభాస్, అనుష్క జోడిగా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సైతం ఉంది. వీరిద్దరి కాంబో అంటే సూపర్ హిట్ కావాల్సిందే.

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాలో అనుష్క కథానాయికగా నటించింది. ఇందులో అనుష్క డ్రెస్సింగ్, లుక్స్ గురించి చెప్పక్కర్లేదు. గ్లామర్ లుక్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది. అయితే సినిమాలో కనిపించే అనుష్కకు.. బయట కనిపించే స్వీటికి చాలా వ్యత్సాసం ఉంటుంది.

నిజానికి అనుష్కకు సల్వార్ కమీజ్ ధరించడం అంటేనే ఇష్టం. కానీ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గ్లామర్ లుక్స్ లో కనిపిస్తుంది. ఇక బిల్లా సినిమాలో ట్రెండీ గ్లామర్ డ్రెస్సులు వేసుకుని మెప్పించింది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత తన తల్లి చెప్పిన మాటలు విని షాకయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క.

తాను ఎప్పుడూ పద్దతిగా ఉండాలని తన తల్లి అనుకుంటుందని.. అలాంటి తన తల్లి బిల్లా సినిమా చూసి ఇంకా స్టైలిష్ గా ఉండొచ్చు కదా.. సగం పద్దతిగా, సగం మోడ్రన్ గా ఆ డ్రెస్సులేంటీ అని అనడంతో ఎంతో షాకయ్యానని చెప్పుకొచ్చింది అనుష్క. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించేసింది అనుష్క. ప్రస్తుతం ఆమె క్రిష్ దర్శకత్వంలో ఘాటీ చిత్రంలో నటిస్తుంది. వేదం సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని కలిగించాయి.




