- Telugu News Photo Gallery This Godavari cool drink has a history of over a hundred years, Now it is available in over the Telugu states
Godavari Drink: ఈ గోదావరి కూల్‌డ్రింక్ చరిత్ర వందేళ్లపైనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతట..
గోదావరి అంటే వెంటనే గుర్తు వచ్చేది సంక్రాంతి. ఇక్కడ కోడి పందేలు, పల్లె అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి. సంస్కృతీ, సంప్రదాయాలకు పెట్టింది పేరు ఈ ప్రాంతం. ఇక్కడ రుచికరమైన పిండి వంటలు, పూతరేకులు, పచ్చళ్ళు కచ్చితంగా రుచి చూడాల్సిందే. ఈ గోదావరి ప్రాంతం 104 ఏళ్ళు చరిత్ర కలిగిన కూల్ డ్రింక్‌కు కూడా ప్రత్యేకం. ఆ కూల్ డ్రింక్ ఏంటో, దాని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 15, 2025 | 7:03 PM

గోదావరి అంటే వెంటనే గుర్తు వచ్చేది సంక్రాంతి. ఇక్కడ కోడి పందేలు, పల్లె అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలి. సంస్కృతీ, సంప్రదాయాలకు పెట్టింది పేరు ఈ ప్రాంతం. ఇక్కడ రుచికరమైన పిండి వంటలు, పూతరేకులు, పచ్చళ్ళు కచ్చితంగా రుచి చూడాల్సిందే. ఈ గోదావరి ప్రాంతం 106 ఏళ్ళు చరిత్ర కలిగిన ఓ కూల్ డ్రింక్‌కు కూడా ప్రత్యేకం.

1919 లో అడ్డూరీ రామచంద్ర రాజు గారు, జగన్నాథరాజు గారు కలిసి మొదలెట్టిన ఈ డ్రింకు ఆర్టోస్. 106 యేళ్లు పూర్తి చేసుకున్న ఈ కూల్‌డ్రింక్ టేస్ట్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. చాలా దిగ్గజ కూల్ డ్రింక్ బ్రాండ్స్ లో పోటీపడి నిలబడిన 100 చరిత్ర ఈ కూల్ డ్రింక్ సొంతం. ఇది మొదలై ఎప్పటి సరిగా 104 ఏళ్ళు పూర్తయింది.

ఈ కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే దీన్ని స్థానికంగా దొరికే పండ్లూ తయారీ, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ, వాసనే కారణం.ఇది గోదావరి జిల్లాల్లో విరివిగా లభించే, అతి ఎక్కువ అమ్ముడుపోయే డ్రింక్. విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ 2001 నుంచి అమ్మకాలను మొదలుపెట్టారు.

ప్రస్తుతం ఈ డ్రింక్స్ తెలుగు రాష్టాల్లో చాల చోట్ల అమ్మకంలో ఉన్నాయి. మీకు ఈ డ్రింక్ గని అందుబాటులో ఉంటె కచ్చితంగా ట్రై చెయ్యండి. హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని షాపుల్లో ఆర్టోస్ డ్రింక్ అందుబాటులో ఉంది.

100 ఏళ్ల చరిత్ర కలిగిన గోదావరి డ్రింక్ ఆర్టోస్ తప్పుగా తాగాల్సిందే. దీని అద్భుతమైన రుచి మరో డ్రింక్‌కి రాదు. ఇందులో గ్రేప్, ఆరెంజ్, ఆపిల్, పైన్ ఆపిల్, లిమెన్ వంటి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల దొరుకుతున్నాయి.




