AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకలితో ఉన్న పిల్లలకి బిస్కెట్లు ఇస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

చిన్నారులకు ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వారి శారీరక ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి సరైన ఆహారం చాలా ముఖ్యం. బిస్కెట్లు, ముఖ్యంగా మైదా, చక్కెర, అధిక నూనెతో కూడిన ప్యాకెట్ బిస్కెట్లు పిల్లల ఆరోగ్యానికి హానికరం అని పిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆకలితో ఉన్న పిల్లలకి బిస్కెట్లు ఇస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
Kids Eating Biscuits
Prashanthi V
|

Updated on: Jun 15, 2025 | 9:49 PM

Share

పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి ఏమి తినిపించాలో తల్లిదండ్రులు నిర్ణయించాలి. పరిశోధనల ప్రకారం.. వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు మొదటగా చిన్నారులపైనే ప్రభావం చూపుతాయి. అందుకే వారికి చిన్నప్పటి నుంచి సరైన పోషకాహారం ఇవ్వడం అవసరం. కేవలం ఆకలి తీరిందని అనుకుంటే సరిపోదు పోషకాలు అందడం ముఖ్యం.

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నప్పుడు బిస్కెట్ చేతిలో పెట్టడం లేదా పాలలో కలిపి మధ్యాహ్న భోజనంగా ఇవ్వడం చేస్తుంటారు. కానీ బిస్కెట్లలో ఎటువంటి పోషక విలువలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు జ్వరం, అలసట లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చినప్పుడు వారి ఆహారపు అలవాట్ల గురించి అడిగితే.. చాలా మంది తల్లిదండ్రులు రోజూ బిస్కెట్లు ఇస్తున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు.

బిస్కెట్లు ఎక్కువగా మైదా, అధిక చక్కెర, నూనెతో తయారవుతాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించకుండా.. కేవలం పనికిరాని కేలరీలను మాత్రమే ఇస్తాయి. పైగా ఇవి తిన్న తర్వాత పిల్లలకు ఎక్కువసేపు ఆకలి వేయదు. దీని వల్ల వారు ఆరోగ్యకరమైన ఇతర ఆహారాలు తీసుకోరు ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.

బిస్కెట్ల బదులు పచ్చి కూరగాయలు, పండ్లు ఉపయోగించి చిన్న చిన్న వంటకాలు తయారు చేయండి. ఇవి రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచివి. ఒకవేళ బిస్కెట్ ఇవ్వాలని అనిపిస్తే.. ఇంట్లోనే గోధుమ పిండి, రాగి, బాదం వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేయండి. మార్కెట్‌ లో హెల్తీ బిస్కెట్ అని అమ్మే వాటిని కూడా గుడ్డిగా నమ్మకండి. వాటిలో నిజంగా ఆరోగ్యకరమైన పదార్థాలు ఉండకపోవచ్చు.

పిల్లలకు చిన్న వయసు నుంచే సరైన ఆహారపు అలవాట్లను నేర్పడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బిస్కెట్లలోని మైదా, అధిక చక్కెర, నూనె పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటి బదులు ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన పోషకాహారాన్ని ఇవ్వడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది.