AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Ice Cream: మీరు ఐస్‌క్రీమ్ ప్రియులా.. ఇంట్లోనే టేస్టీగా ఈజీగా మిక్స్డ్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ తయారు చేసుకోండి ఇలా

Fruit Ice Cream: వేసవి కాలం(Summer Season) లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని అందరూ భావిస్తారు. తినే ఆహారంతో పాటు ధరించే దుస్తుల వరకూ వేసవి తాపాన్ని(Summer Heat) తీర్చేలా..

Fruit Ice Cream: మీరు ఐస్‌క్రీమ్ ప్రియులా.. ఇంట్లోనే టేస్టీగా ఈజీగా మిక్స్డ్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్ తయారు చేసుకోండి ఇలా
Mixed Fruit Ice Cream
Surya Kala
|

Updated on: Mar 23, 2022 | 9:11 AM

Share

Fruit Ice Cream: వేసవి కాలం(Summer Season) లో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని అందరూ భావిస్తారు. తినే ఆహారంతో పాటు ధరించే దుస్తుల వరకూ వేసవి తాపాన్ని(Summer Heat) తీర్చేలా ఉండేలా చూసుకుంటాం.. అయితే వేసవితాపాన్ని తీర్చుకోవడానికి శరీరానికి చల్లదనం ఇచ్చే  వాటర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే వేసవికాలంలో ఎక్కువ మంది ఐస్ క్రీమ్ ను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఆయితే ఇంట్లోనే ఐస్ క్రీమ్ ని ఎంతో టేస్టీ గా చాలా ఈజీ చేసుకోవచ్చు. ఈరోజు ఇంట్లో ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారీ.. తినడం వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు:

ఆపిల్ : అర కప్పు ముక్కలు తెల్ల ద్రాక్ష : కొన్ని ముక్కలు అరటిపండు : అర కప్పు ముక్కలు బొప్పాయి : అర కప్పుముక్కలు చెర్రీస్: 5 బాదం: 10 (ముక్కలు) జీడిపప్పు: 10 (ముక్కలు) స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ : రెండు కప్పులు వెనిల్లా ఐస్ క్రీమ్ : కప్పు పిస్తా ఐస్ క్రీమ్ : రెండు కప్పులు పంచదార: ఒకటిన్నర కప్పు

తయారీ విధానం:  ఒక దళసరి గిన్నె తీసుకుని చక్కర వేసి.. దానికి సరిపడా నీరు వేసుకుని కరిగించుకోవాలి. ఈ షుగర్ సిరప్ లో కట్ చేసి పెట్టుకున్న ఆపిల్, బొప్పయి, అరటిపండు, ద్రాక్ష,  ముక్కలను వేసుకుని ఆ గిన్నెను.. ప్రైజ్ లో పెట్టాలి. అరగంట తర్వాత ఆ సిరప్ ను తీస్కుని.. పొడవును గాజు గ్లాసుని తీసుకుని దానిలో సిరప్ లోని పండ్ల ముక్కలను వేసి.. అనంతరం దానిమీద స్టాబెరీ ఐస్ క్రీమ్ ఒక లేయర్, అనంతరం పిస్తా ఐస్ క్రీమ్  ఒక లేయర్, వెనిల్లా ఐస్ క్రీమ్ ఒక లేయర్ వేసి.. అనంతరం కట్ చేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు ముక్కలతో పాటు చెర్రీస్ పెడితే.. కలర్ ఫుల్  టేస్టీ హెల్తీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ.

ఐస్‌క్రీమ్‌ అధిక మొత్తంలో కొవ్వులు, ప్రోటీన్లు , కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇందులోని పండ్లు శరీరానికి శక్తిని ఇస్తాయి. ఆరోగ్యాన్ని ఇస్తాయి. అయితే ఎండలో వెళ్లి వచ్చిన వెంటనే లేదా వడ దెబ్బకు గురైన వెంటనే ఐస్ క్రీం తీసుకుంటే గొంతు నొప్పి , జ్వరం వచ్చే అవకాశం ఉంది.

Also Read: Shaheed Diwas 2022: నేడు అమరవీరుల దినోత్సవం.. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను స్మరించుకుంటున్న యావత్ భారతం