Shaheed Diwas 2022: నేడు అమరవీరుల దినోత్సవం.. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను స్మరించుకుంటున్న యావత్ భారతం
Shaheed Diwas 2022: అమరవీరుల దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం భగత్ సింగ్ (Bhagat Singh), రాజ్‌గురు(Rajguru), సుఖ్‌దేవ్ (Sukhdev)లను స్మరించుకుంటుంది..
Shaheed Diwas 2022: అమరవీరుల దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం భగత్ సింగ్ (Bhagat Singh), రాజ్‌గురు(Rajguru), సుఖ్‌దేవ్ (Sukhdev)లను స్మరించుకుంటుంది. మార్చి 23, 1931న బ్రిటీష్ వారు ప్రస్తుతం పాకిస్థాన్ లోని లాహోర్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురిని ఉరితీశారు. విప్లవ వీరులు భారత స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు , సుఖ్‌దేవ్ థాపర్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 23ని షహీద్ దివస్ గా జరుపుకుంటాము. 1928లో లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భగత్ సింగ్ ఒక పోలీసు అధికారిని చంపాలని పథకం వేశారు.
సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా అహింసాయుత నిరసనకు నాయకత్వం వహించిన లాలా లజపతిరాయ్ పై లాఠీ ఛార్జ్ చేయాలనీ.. బ్రిటీష్ పోలీసు అధికారి జేమ్స్ ఎ స్కాట్ ఆదేశించాడు. ఈ దాడిలో గాయపడిన రాయ్ మరణించారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన భగత్ సింగ్, రాజ్‌గురు , సుఖ్‌దేవ్ లు కలిసి ఆ బ్రిటిష్ పోలీసు అధికారి స్కాట్‌ను ఉరితీయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 1929 ఏప్రిల్ 8న ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై భగత్ సింగ్, రాజ్‌గురు సుఖ్‌దేవ్ ముగ్గురూ బాంబులు వేశారు. జేమ్స్ స్కాట్ అనుకొని పొరపాటున జార్జ్ శాండర్స్ అనే కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. ఆ తరువాత “ఇంక్విలాబ్ జిందాబాద్”.. విప్లవం.. వర్థిల్లాలి అనే నినాదంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు.
అప్పుడు బ్రిటిష్ వారు ఈ ముగ్గురు స్వాతంత్ర సమరయోధులపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అభియోగం మోపింది. ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు హత్య కేసులు పెట్టి జైలుకు పంపారు. ఈ ముగ్గురుని మార్చి 23, 1931న బ్రిటీష్ ఇండియా (ప్రస్తుతం పాకిస్థాన్)లోని లాహోర్ సెంట్రల్ జైలులో బ్రిటీషర్లు ముగ్గురిని ఉరితీశారు. సట్లెజ్ నది ఒడ్డున ముగ్గురి అంత్యక్రియలు జరిగాయి. స్వాతంత్యం వచ్చిన అనంతరం.. ప్రతి సంవత్సరం మార్చి 23ని షహీద్ దివాస్ లేదా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
Also Read:
My Name Is Shruthi: ఇలాంటి సినిమా నేనెప్పుడూ చేయలేదంటున్న బ్యూటీ.. ఆసక్తికరంగా హన్సిక సినిమా
Nitin Gadkari: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులకు కేంద్రం శుభవార్త.. భారీ ప్రణాళిక