- Telugu News Photo Gallery Summer beauty care try these beauty tips to get rid of smell in underarms in Telugu
Summer beauty tips: వేసవిలో ఆ ప్రదేశంలో దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..
Smelly underarms: వేసవిలో విపరీతమైన వేడి కారణంగా అండర్ ఆర్మ్స్ నుండి వచ్చే చెమట వాసన చికాకు కలిగిస్తుంది. దీంతో చాలామంది అసౌకర్యంగా ఫీలవుతుంటారు. పనులు కూడా సరిగా చేసుకోలేరు. కొన్ని సహజ చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.
Updated on: Mar 23, 2022 | 8:04 AM

యాపిల్ సైడర్ వెనిగర్: అండర్ ఆర్మ్స్ వాసనను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తుంది . ఇందుకోసం ఒక గిన్నెలో కొంచెం నీరు తీసుకుని అందులోకి రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు ఈ నీటితో మీ అండర్ ఆర్మ్స్ ను శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చెమట వాసన రాదు.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె కూడా అండర్ ఆర్మ్స్ వాసనను తొలగించడంలో బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందుకోసం కొద్దిగా కొబ్బరి నూనెను మీ చేతుల్లోకి తీసుకుని, అండర్ ఆర్మ్స్‌కు మసాజ్ చేయండి. కొద్ది సేపు అలాగే ఉంచిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి

నిమ్మకాయ: చర్మ సంరక్షణలో ఉత్తమమైన నిమ్మకాయ, అండర్ ఆర్మ్స్ వాసనతో పాటు నల్లమచ్చలను కూడా తొలగిస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని చేతుల కింద భాగంలో అప్లై చేయాలి. కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో మాత్రమే శుభ్రం చేసుకోవాలి

బంగాళదుంప ముక్కలు: అండర్‌ఆర్మ్స్ నుండి వచ్చే దుర్వాసనను తొలగించుకోవడానికి బంగాళదుంపల సహాయం తీసుకోవచ్చు. ఒక బంగాళాదుంప ముక్కను తీసుకుని, కాసేపు చేతుల కింద ఉంచుకోండి. ఇది సమర్థంగా పనిచేస్తుంది. అయితే చాలాతక్కువ మందికి మాత్రమే ఈ చిట్కా తెలుసు.

వేసవిలో చెమట కారణంగా అండర్ ఆర్మ్స్ వాసన బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకోసం ఈ సహజ చిట్కాలు పాటించాలి.

టొమాటో జ్యూస్: ఈ హోం రెమెడీ వేసవిలో అండర్ ఆర్మ్స్ నుంచి వచ్చే వాసనను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. దీని కోసం, టొమాటోను బాగా తురిమి దాని రసాన్ని ఒక పాత్రలోకి తీసుకోండి. ఇప్పుడు కాటన్ సహాయంతో అండర్ ఆర్మ్స్‌ను మసాజ్ చేయండి. కొద్ది సేపటి తర్వాత శుభ్రమైన నీటితో కడుక్కోండి




