Health Tips: రోట్లో లేదా మిక్సీలో.. పచ్చడి ఎందులో చేస్తే మంచిది.. వివరాలు ఇవిగో
పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ.. ఇలా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. మరి, అలాంటి చట్నీని తయారుచేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం..? మిక్సీ లేదంటే వెట్ గ్రైండర్ కదూ! సులభంగా, త్వరగా చట్నీ చేయడం పూర్తవుతుంది కాబట్టే అందరూ వీటి పైనే ఆధారపడుతుంటారు.

పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, కరివేపాకు చట్నీ.. ఇలా ఏదో ఒక పచ్చడి లేనిదే మన భోజనం పూర్తి కాదు. మరి, అలాంటి చట్నీని తయారుచేసుకోవడానికి మనం ఏం ఉపయోగిస్తాం..? మిక్సీ లేదంటే వెట్ గ్రైండర్ కదూ! సులభంగా, త్వరగా చట్నీ చేయడం పూర్తవుతుంది కాబట్టే అందరూ వీటి పైనే ఆధారపడుతుంటారు. కానీ అదే సమయంలో రోట్లో రుబ్బుకున్న పచ్చడి అందించే రుచిని ఇది అందించలేదని కూడా అంటుంటారు మన పెద్దవాళ్లు. మరి, మిక్సీలో రుబ్బుకున్న పచ్చడి కంటే రోట్లో చేసుకున్న పచ్చడికి ఎందుకంత రుచి వస్తుంది? దానివల్ల మన ఆరోగ్యానికి అందే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..
మన భారతీయ పాకశాస్త్రంలో పచ్చళ్లది ప్రత్యేక స్థానం. అందుకే వారానికి కనీసం మూడుసార్లు ఏదో ఒక పచ్చడిని ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. పచ్చళ్లను లంచ్‌లో భాగంగా తినడం వల్ల మధ్యాహ్నం భోంచేశాక వచ్చే ఒక రకమైన నిద్ర మత్తు, అలసటకు దూరంగా ఉండచ్చట. ఇక చట్నీ చేసే క్రమంలో వీటిలో వాడే పదార్థాలన్నీ పచ్చడి బండతో ముక్కలు ముక్కలు చేయడం వల్ల వాటిలోని సూక్ష్మ పోషకాలు, స్టెరోల్స్, ఫ్లేవనాయిడ్స్.. మొదలైనవన్నీ బయటికి విడుదలవుతాయి. ఆ చట్నీని తినడం వల్ల అవన్నీ మన శరీరానికి బాగా పడతాయంటున్నారు పోషకాహార నిపుణులు.
చాలామంది చట్నీ అనగానే మిక్సీ లేదా వెట్ గ్రైండర్‌లో చేసేస్తుంటారు. త్వరగా పని పూర్తవడంతో పాటు ఎలాంటి అసౌకర్యం లేకుండా సులభంగా చట్నీ చేసేయచ్చని భావిస్తారు. నిజానికి ఇలా మిక్సీలో చట్నీ చేయడం వల్ల వాటిలోని పోషకాలన్నీ నశించిపోతాయి. అదెలాగంటే.. మనం పచ్చడి కోసం వాడే పదార్థాల్లో ఉండే కొన్ని సూక్ష్మ పోషకాలు వేడికి తట్టుకోలేవు. కాబట్టి మిక్సీ లేదా గ్రైండర్‌లో పచ్చడి చేసే క్రమంలో ఉత్పత్తయ్యే వేడి వల్ల ఇవన్నీ నశించిపోతాయి. అదే రోట్లో రుబ్బుకునే పచ్చళ్ల కోసం పచ్చడి బండను ఉపయోగిస్తుంటాం. ఇది ఉష్ణ నిరోధకం కాబట్టి పచ్చడి చేసే క్రమంలో వేడి పుట్టకుండా అందులోని పోషకాలన్నీ అలాగే నిక్షిప్తమై ఉంటాయి. ఇలా రోట్లో చేసే పచ్చడి వల్ల ఆయా పదార్థాల్లోని సుగుణాలన్నీ మన శరీరానికి అందుతాయి.. అలాగే చక్కటి రుచినీ ఆస్వాదించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి