Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ తిన్న తర్వాత వీటిని తినకండి..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ తిన్న తర్వాత కొన్ని ఆహారాలను తినకూడదు. మటన్ తిన్న వెంటనే వెల్లుల్లి తింటే వాంతులు, శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మటన్ తిన్న తర్వాత ఈ పదార్థాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆహార నియమాలను పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు నివారించుకోవచ్చు.

మటన్ తిన్న తర్వాత వీటిని తినకండి..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Mutton Curry
Follow us
Prashanthi V

|

Updated on: Feb 01, 2025 | 11:15 PM

మటన్ అంటే చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైనది. చికెన్ కంటే ఎక్కువ రుచిగా ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో మటన్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. పైగా దీంట్లో అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ B12 కూడా ఇందులో ఉండటం వల్ల చర్మం, జుట్టు, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీని పెంచి శరీరానికి బలాన్ని అందిస్తుంది.

మటన్‌లో ఉన్న స్కిన్ పార్ట్ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. రెగ్యులర్‌గా మటన్ తింటే కడుపులో ఉన్న అల్సర్స్ కూడా తగ్గుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉన్న ప్రోటీన్ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే మటన్ తిన్న వెంటనే కొన్ని పదార్థాలను తినకపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, కొన్ని ఆహార పదార్థాలు మటన్‌తో కలిసి ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయట. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

వెల్లుల్లి

మటన్ తిన్న తర్వాత వెల్లుల్లిని తినడం వల్ల తీవ్రమైన వాంతులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

నిమ్మకాయ

మటన్ తిన్న వెంటనే నిమ్మకాయను తినకూడదు. నిమ్మ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచి అసహనాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మూర్ఛ వచ్చేలా చేయవచ్చు.

తేనె

మటన్ తిన్న తర్వాత తేనెను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. తేనె మటన్‌లోని పోషకాలతో ప్రతికూలంగా పనిచేసి శరీర వేడిని పెంచుతుంది. దీని ఫలితంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా చూసుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది.

మటన్ రుచికరమైనది పైగా ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది కూడా. అయితే ఇది తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం వల్ల అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. వైద్య నిపుణుల సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకుంటే మటన్‌ను ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)