Ragi Semiya Recipe: ఈజీగా టేస్టీగా కొబ్బరి పాలతో రాగి సేమియా పాయసం తయారీ విధానం

Ragi Semiya Payasam Recipe: పండగలకు, ఫంక్షన్లకే కాదు.. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే.. వెంటనే ఇంట్లో ఉన్న సేమియా వైపు చూస్తాం. నోరూరించే ఈ సేమియా పాయసాన్ని..

Ragi Semiya Recipe: ఈజీగా టేస్టీగా కొబ్బరి పాలతో రాగి సేమియా పాయసం తయారీ విధానం
Ragi Semiya Payasam
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 19, 2021 | 6:51 PM

Ragi Semiya Payasam Recipe: పండగలకు, ఫంక్షన్లకే కాదు.. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే.. వెంటనే ఇంట్లో ఉన్న సేమియా వైపు చూస్తాం. నోరూరించే ఈ సేమియా పాయసాన్ని కొన్ని ప్రాంతాల్లో ఖీర్ అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా రంగులను ఉపయోగిస్తారు. ఒకప్పుడు రాగులు గ్రామాల్లో ప్రధాన ఆహారంగా ఉండేది.. కానీ ప్రస్తుతం రాగులోని ఆరోగ్య ప్రయోజనాలు బాగా ప్రాచుర్యం పొందడంతో.. రాగి పిండిని పట్టణాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. ఈ రాగులతో జావ, దోశ ,కుడుములు వంటి అనేక రకాల ఆహార పదార్ధాలను కూడా తయారు చేస్తారు. అయితే ఈ రోజు రెగ్యులర్‌గా చేసుకునే సేమియా కంటే భిన్నంగా కొబ్బారి పాలతో ఈజీగా ఎంతో టెస్ట్ గా ఉండే రాగి సేమియా తయారీవిధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

రాగి సేమియా – ఒక కప్పు కొబ్బరి పాలు – రెండు కప్పులు ఎండు కొబ్బరి తురుము పావు కప్పు బెల్లం పొడి ఒక కప్పు యాలకుల పొడి నెయ్యి జీడి పప్పు కిస్ మిస్ బాదం

తయారి విధానం:

స్టౌ వెలిగించి బాణలి పెట్టి.. కొంచెం నెయ్యి వేసుకోవాలి.. నెయ్యి వేడి ఎక్కిన తర్వాత జీడి పప్పు, బాదం పప్పు, కిస్ మిస్ వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరికొంచెం నెయ్యి వేసుకుని రాగి సేమియా వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకుని ఒక గిన్నె స్టౌ మీద పెట్టి..దానిలో కొబ్బరి పాలు వేసుకుని మరిగించాలి. సేమియా ఉడికిన తర్వాత కొబ్బరి తురుము వేసి ఒక్క ఉడుకు రానివ్వాలి.. తర్వాత బెల్లం తురుము వేసుకుని బాగా కలిపి ఉడికించాలి. తర్వాత యాలకుల పొడి, వేయించుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకుని స్టౌ మీద నుంచి దింపేసి.. కొంచెం నెయ్యి వేసుకుని తింటే .. ఆహా ఏమి రుచి అంటారు.

Also Read: Waterfalls: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాలువారుతున్న జలపాతాలు.. వర్షాలతో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు