Waterfalls: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాలువారుతున్న జలపాతాలు.. వర్షాలతో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

Waterfalls in Karimnagar: తొలకరి చినుకులు ప్రకృతి పులకరిస్తుంది. పచ్చని అందాలతో మనసుని రంజిపజేస్తుంది. ఇక వర్షాలతో.. ప్రకృతి ఒడిలోని.. ఎత్తైన కొండల్లోని జాలువారే..

Waterfalls: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జాలువారుతున్న జలపాతాలు.. వర్షాలతో కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు
Water Falls
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 19, 2021 | 4:02 PM

Waterfalls in Karimnagar: తొలకరి చినుకులు ప్రకృతి పులకరిస్తుంది. పచ్చని అందాలతో మనసుని రంజిపజేస్తుంది. ఇక వర్షాలతో.. ప్రకృతి ఒడిలోని.. ఎత్తైన కొండల్లోని జాలువారే జలపాతాలు, గలగాలపారే సెలయేళ్ళు సరికొత్త అందాలను సంతరించుకుంటాయి. అప్పుడు అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. కొండకోనలోని.. ఎత్తైన కొండల మీద నుంచి వయ్యారి భామల దూకుతున్న జలపాతాలను చూడాలంటే.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.. మన తెలుగు రాష్ట్రాల్లోనే అనేక అందాలు ఉన్నాయి. కొద్దీ రోజులుగా వర్షాలు జోరందుకున్న నేపథ్యంలో ఉమ్మడి కరీం నగర జిల్లాలోని పలు జలపాతాలు నయగారాలను తలపిస్తూ కనువిందు చేస్తున్నారు. ఈ అందాలను ఆస్వాదించాలంటే కొంచెం చేరుకోవడానికి కష్టమైనా ఆస్వాధించడానికి యువత ఆసక్తి చూపిస్తుంది.. ప్రఖ్యాతి గాంచకపోయినా అడవి అందాలు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఈరోజు ఆ జలపాతాలను సందర్శించడానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం..

పెద్దపల్లి జిల్లాలో ఉన్న పాండవలోంక జలపాతం ఆకట్టుకుంటుంది. జాఫర్‌ఖాన్‌పేట సమీపంలో పాండవలొంక జలపాతం ఉంటుంది. ఇక్కడ బండరాళ్లు పల్లపరుపుగా ఉండి వర్షం పడినప్పుడు నీరు ఏటవాలుగా అంచెలంచెలుగ కిందకి జారే అపురూప దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటాయి. పెద్దపల్లి నుంచి అడవి శ్రీరాంపూర్, పారుపెల్లి, ముత్తారం వెళ్లే బస్సులు,ఆటోల్లో కూనారం వెళ్లే దారిలో వెన్నంపల్లి మీదుగా జాఫర్‌ఖాన్‌పేటకు చేరుకోవచ్చు. ఇక్కడ జలపాతంతో పాటు.. శ్రీరాముడి పాదాలు, ఆంజనేయస్వామి గుడి, నాగదేవతలను దర్శించుకోవచ్చు.

ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని లొంక రామన్న జలపాతం కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది. కథలాపూర్‌ మండలం పోతారం గ్రామశివారులోని లొంక రామన్న జలపాతం ఉంది. దీనిని చూడడానికి వర్షాకాలంలో భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ జలపాతానికి చేరుకోవడానికి కోరుట్ల నుంచి వేములవాడ తో పాటు.. సిరిసిల్ల నుంచి కూడా దారులున్నాయి.

ఉమ్మడి కరీం నగర్ జిల్లాలోని మరొక అందమైన జలపాతం రాయికల్‌ జలపాతం. ఇది సైదాపూర్‌ మండలంలో ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతం హొయలు ఒలికిస్తూ.. జాలువారుతోంది. 18 గుట్టల పైనుంచి పడే వర్షపు నీటితో ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సైదాపూర్‌కు 10కిలోవీుటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని సందర్శించడానికి హుజూరాబాద్, హుస్నాబాద్, ముల్కనూరు నుంచి దారులున్నాయి.

కోరుట్ల గోదావరి పరివాహక ప్రాంతంలో వేంపల్లి గుండం ఉంది. గోదావరి మూడు పాయలుగా చీలి కొంత దూరం పయనించి మళ్లీ రెండు పాయలుగా మారి ఇక్కడ కలుస్తుంది. బండరాళ్ల మీద నుంచి గోదావరి పయనిస్తూ.. జలపాతంగా మారింది. చూడడానికి ఎంతో సుందరంగా ఉంటుంది. కోరుట్లనుంచి గొర్రెపల్లి గ్రామం చేరుకోవడానికి పలు రహదారి మార్గాలున్నాయి.

ఉమ్మడి కరీం నగరంలోని పేమస్ జలపాతం గౌరీ గుండాలు. ఇది వర్షం పడిన సమయంలో మంచి అందాలను సంతరించుకుంటుంది. దీంతో స్థానికులు ఎక్కువగా ఈ జలపాతాన్ని సందర్శించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పెద్దపల్లినుంచి 13 కిలోమీటర్ల దూరంలో గౌరీగుండాలు జలపాతం ఉంది. అయితే ఈ సారి స్థానికులు గౌరీ గుండాలను చూడడకి పర్యాటకులు రావొద్దు అంటూ స్తానికులు విజ్ఞప్తి చేశారు.

Also Read: BPNL Recruitment 2021: పశుసంవర్దశాఖ సంస్థలో భారీ ఉద్యోగ నియామకాలు.. టెన్త్ అర్హత.. ఎలా అప్లై చేసుకోవాలంటే

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!