ఈ ఆరోగ్య సమస్యలున్నవారు గుమ్మడికాయ గింజలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..
Pumpkin Seed: గుమ్మడికాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఆహారంలో వివిధ రకాలుగా
Pumpkin Seed: గుమ్మడికాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది తినడానికి రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఆహారంలో వివిధ రకాలుగా వాడుతారు. దీని విత్తనాలలో ఫైబర్, విటమిన్ ఎ, సి, ఈ, ఐరన్, కాల్షియం, నియాసిన్, రిబోఫ్లేవిన్, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుమ్మడికాయ గింజలను ఎండబెట్టి పొడి చేయడం ద్వారా ఉపయోగించవచ్చు. మీరు దీనిని సూప్‌లు, సలాడ్లు, తీపి వంటలలో వాడవచ్చు. ఈ విత్తనాన్ని తినేటప్పుడు దాని పరిమాణంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలి. అంతేకాదు ఒక రకమైన శారీరక అనారోగ్యంతో బాధపడుతుంటే గుమ్మడికాయ గింజలకు దూరంగా ఉండాలి.
1. గర్భిణీ పాలిచ్చే మహిళలు గర్భిణీ, పాలిచ్చే మహిళలు గుమ్మడికాయ గింజలను మితంగా తీసుకోవాలి. కాని గుమ్మడికాయ గింజలు వీరికి హానికరమని ఎక్కడ నిరూపించలేదు. శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు.
2. మధుమేహ రోగులు డయాబెటిక్ రోగులకు గుమ్మడికాయ గింజలు ప్రయోజనకరంగా ఉంటాయని అనేక పరిశోధనలలో వెల్లడైంది ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే గుమ్మడికాయగింజల గురించి ఆలోచించండి.
3. తక్కువ రక్తపోటుతో తినవద్దు గుమ్మడికాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒకవేళ మీకు తక్కువ బీపీ తక్కువ ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి.
4. పొట్ట సమస్యలు గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. మీరు దానిని అధిక పరిమాణంలో తింటే అతిసారం సమస్య ఉండవచ్చు. ఇది కాకుండా కడుపు నొప్పి, తిమ్మిరి, ఉబ్బరం పెంచుతుంది. అందుకే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.