- Telugu News Photo Gallery Know these things protect you from the risk of terrible diseases like cancer you should definitely include in your diet
క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించే ఫుడ్.. రోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలను అస్సలు ఉండవు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి భారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ ముంగుగానే తెలియకపోయిన.. రెండువ, మూడవ దశలో మాత్రమే గుర్తిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి మనవరకు రాకుండా ఉండాలంటే.. కొన్ని ఆహార పదార్థాలను రోజూ వారి డైట్లో చేర్చుకోవాలి. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Oct 07, 2021 | 1:16 PM

ఆయుర్వేదంలో పిప్పిలిని మెడిసిన్ ఔషధంగా ఉపయోగిస్తారు. క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఈ పిప్పిలి ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యానర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదలైన సమస్యలను నివారించవచ్చు.

ఎరుపు రంగు చెర్రీస్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో మెలటోనిన్ అనే మూలకం.. ఆంథోసైనిస్ అనే ఎర్ర వర్ణద్రవ్యం, రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే అన్ని ఇతర పోషకాలు ఉంటాయి. చెర్రీస్ గుండెపోటు, క్యాన్సర్ ప్రమాదాన్ని 50 శాతం తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

బ్రోకలీని తీసుకోవడం వలన శరీరంలో మంట తగ్గుతుంది. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. బ్రోకలీ తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది.

యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీట్యూమర్ లక్షణాలు ఉన్నాయి. యాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కొలరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని అనేక అధ్యాయనాల్లో వెల్లడైంది.





























