AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవల్సిందే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో సుమారు 25 శాతం మంది ప్రజలు ఊబకాయం (Obesity) తో బాధ పడుతున్నారట.

Health Tips: ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవల్సిందే..
Obesity
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 26, 2022 | 8:01 PM

Share

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో సుమారు 25 శాతం మంది ప్రజలు ఊబకాయం (Obesity) తో బాధ పడుతున్నారట. ఇక భారతదేశంలో 11.3 శాతం మంది, అమెరికాలోనే 31 శాతం మంది ఊబకాయానికి గురవుతున్నారు. ఈ సమస్యను అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు, షుగర్, టైప్ 2 డయాబెటిస్, గుండెపోటు తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉందచి WHO హెచ్చరిస్తోంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని (Healthy Life Style) ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు. అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో పాటు కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తగ్గించుకోవాలంటున్నారు. మరి ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార మార్పులు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

పప్పులు

సాధారణంగా మాంసాహార పదార్థాల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే శాఖాహారులు ప్రొటీన్ల ప్రయోజనాలు పొందాలంటే పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి స్వచ్ఛమైన ప్రోటీన్లు కానప్పటికీ మరియు తక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్లను కలిగి ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా వివిధ రకాల పప్పులను ఆహారంలో చేర్చుకోవాలి.

గుడ్లు

గుడ్డులోని తెల్ల సొన, పచ్చసొన రెండింటిలోనూ ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే బరువు తగ్గాలంటే గుడ్డులోని తెల్లసొన మాత్రమే తినాలి అనేది కేవలం అపోహ మాత్రమే. పైగా ఇందులో తక్కువ కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అందుకే ఊబకాయంతో బాధపడుతున్న వారు గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండింటినీ నిరభ్యంతరంగా తినవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చికెన్‌, చేపలు

సాధారణంగా అన్ని రకాల చేపలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి పలు రకాల పోషకాలు అందుతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. చేపలను తరచుగా తీసుకునేవారిలో ఊబకాయం సమస్యలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మీరు మాంసాహారులయితే చికెన్‌ను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ప్రొటీన్లతో పాటు పలు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

గింజలు, విత్తనాలు

అన్ని రకాల విత్తనాల్లోనూ ప్రొటీన్లు విరివిగా ఉంటాయి. ముఖ్యంగా చియా విత్తనాలు, గుమ్మడి గింజల్లొ అధిక స్థాయుల్లో ప్రోటీన్లు ఉంటాయి. కలిగి ఉంటాయి. ఊబకాయం సమస్యలతో బాధపడేవారు వివిధ రకాల విత్తనాలు, గింజలను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు వివిధ రకాల నట్స్, డ్రై ఫ్రూట్స్ లోనూ ప్రోటీన్ల శాతం బాగానే ఉంటుంది. అయితే ఎండుద్రాక్ష, అత్తి పండ్లలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్‌ వార్‌ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?

UP Assembly Election 2022: యూపీ ఎన్నికలు.. ఓటర్లకు అఖిలేష్ ఇచ్చిన ఆ హామీ గేమ్ ఛేంజర్ కానుందా?

Viral Photo: తగ్గేదేలే! మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో పామును కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్..