Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple Benefits: వేసవిలో పైనాపిల్‌ను డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా

పైనాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగులు ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడేలా పనిచేస్తుంది.

Pineapple Benefits: వేసవిలో పైనాపిల్‌ను డైట్‌లో ఎందుకు చేర్చుకోవాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా
Pineapple Health Benefits
Follow us
Surya Kala

|

Updated on: Mar 19, 2023 | 10:36 AM

పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో పండ్లను చేర్చుకోవడం మంచిది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా అవి రక్షిస్తాయి. అదే సమయంలో.. నీరు సమృద్ధిగా ఉన్న పండ్లు శరీరం హైడ్రేట్ గా ఉంచడానికి పని చేస్తాయి. ఈ పండ్లలో ఒకటి పైనాపిల్. ఇది చాలా రుచికరమైన పండు. దీనిని సలాడ్‌లో లేదా ముక్కులుగా కట్ చేసుకుని తినవచ్చు. జ్యుసి గా చేసుకుని తీసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుండి రక్షించడానికి కూడా పనిచేస్తుంది. పైనాపిల్ ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈరోజు తెల్సుకుందాం..

జీర్ణక్రియ కోసం పైనాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగులు ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడేలా పనిచేస్తుంది. ఇందులో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది ఒక ఎంజైమ్. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తికి మంచి బూస్టర్ పైనాపిల్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అనాసపండు ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి అనాస పండును ఆహారంలో కూడా చేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గౌట్ కి చికిత్స పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉంటుంది. ఈ ఎంజైమ్ నొప్పి.. వాపుతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి  నొప్పి , వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఒక నివేదిక ప్రకారం, పైనాపిల్‌లో ఉండే లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదం నుండి రక్షించడానికి పని చేస్తాయి.

గుండె ఆరోగ్యం పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణగా పనిచేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎముకలను బలపరుస్తుంది పైనాపిల్ ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఇందులో కాల్షియం ఉంటుంది. బలహీనమైన ఎముకల సమస్య నుంచి బయటపడేందుకు ఇది పనిచేస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అందించింది. దీనిని పాటించే ముందు వైద్య నిపుణులు, లేదా పర్యవేక్షుల సూచనలు, సలహాలను పాటించాల్సి ఉంటుంది.)